Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రంకెలు వేస్తున్న నాయకులూ ఉద్రిక్తతల మధ్య సాగర్ సమరం…

రంకెలు వేస్తున్న నాయకులూ ఉద్రిక్తతల మధ్య సాగర్ సమరం
-మంత్రిని నిలదీసిన నిరుద్యోగ యువకుడు … మండి పడ్డ మంత్రి జగదీష్ రెడ్డి
– నీలాంటి కుక్కలలాగా చాలామందిని చేశానన్న మంత్రి
-మంత్రి మాటలపై మండిపడ్డ గ్రామస్తులు
-జానారెడ్డి స్వగ్రామంలో టీఆర్ యస్ అభ్యర్థి భగత్ ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్తులు
-పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వివాదం …లాఠీ ఛార్జ్
-నాయకులను ప్రలోభాలకు గురిచేస్తున్న పార్టీలు
-గ్రామాల్లో టెన్సెన్ వాతావరణం
-మూడు పార్టీలు పోటాపోటీ

ఎన్నిక చిన్నదే …దీనివల్ల ప్రభుత్వాలు ఏమిమారిపోవు కాని రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయనుండటంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఫలితంగా పల్లెలో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. పార్టీ నేతలు గ్రామాల్లో ప్రచారం చేయటంకన్నా రంకెలు వేస్తున్నారు. పరస్పర ఆరోపణలు , వ్యక్తిగత విమర్శలతో అక్కడ ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే ఆదోళన ప్రజల్లో కలుగుతుంది. ఇప్పటికే హేమాహేమీలు ప్రచారంలో పాల్గొంటున్నారు . కాంగ్రెస్, టీఆర్ యస్ , బీజేపీ నేతలు ,సాగర్,మిర్యాలగూడ, నల్లగొండలలో మకాం వేశారు. నిత్యం గ్రామాలలో తిరుగుతున్నారు. ప్రచారం హోరెత్తుతోంది . ఎక్కడ చుసిన ఎన్నికపైనే చర్చ జరుగుతుంది. ఈ నెల 17 న పోలింగ్ జరగనున్నది. 15 సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారం ఉంటుంది. ప్రచారానికి మరో కొద్దీ గంటల సమయం మాత్రమే ఉండటంతో రాజాకీయ పార్టీలు పరుగులు పెడుతున్నాయి.టీఆర్ యస్ తరుపున మంత్రి జగదీష్ రెడ్డి తో పాటు,మంత్రులు మహమూద్ అలీ , తలసాని శ్రీనివాస్ యాదవ్ , పలువురు ఎమ్మెల్యేలు , ప్రచారం నిర్వహిస్తుండగా , కాంగ్రెస్ తరుపున ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క , కోమటిరెడ్డి వెంకట రెడ్డి , రేవంత్ రెడ్డి , ష్రబ్బిర్ అలీ , సీతక్క , బలరాం నాయక్ , బెల్లయ్య నాయక్, రాములు నాయక్ , బీజేపీ తరుపున బండి సంజయ్, కిషన్ రెడ్డి , అరవింద్ , ఇతర నేతలు ప్రచారంలో ఉన్నారు.

ప్రచారంలో భాగంగా అనుముల మండలం కొత్తపల్లిలో మంగళవారం మంత్రి మాట్లాడుతుండగా వాహనం వద్దకు అదే గ్రామానికి చెందిన నిరుద్యోగి అలుగుల అశోక్‌రెడ్డి వచ్చి ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగభృతి హామీ ఏమైందని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన మంత్రి నీలాంటి కుక్కలను చాలా మందిని చూశానని,కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ‘నిన్ను, నీ నాయకుణ్ని తొక్కిపడేస్తా’నంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆ యువకుణ్ని పంపించివేశారు. ఎమ్మెస్సీ చేసిన అశోక్‌రెడ్డి ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశాడు. లాక్‌డౌన్‌ తర్వాత ఇంటికి వచ్చి ‌ పొలం పనులు చేసుకుంటున్న ఆయువకుడిపై మంత్రి ఫైర్ కావడం నియోజకవర్గంలో చర్చనీయాంశం అయింది. టీఆర్ యస్ అభ్యర్థిని జానారెడ్డి స్వగ్రామమైన అనుములకు రాకుండా అడ్డుకోవడంపై తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది . మహిళలు పెద్ద ఎత్తున గుమిగూడి గత ఎన్నికలలో చేసిన వాగ్దానాలు నెరవేర్చ కుండా గ్రామంలోకి రావద్దని అడ్డుకోవడం పోలిసుల ప్రవేశం ,టీఆర్ యస్ ,కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాటకు దారితీసింది. విషయం తెలుసుకున్న జానారెడ్డి చిన్న కుమారుడు.జయవీర్ రెడ్డి రావడం తో మరింత ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఇరు పార్టీల వారిని చెదర గొట్టారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ కార్యకర్తలు తమ పార్టీ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. జానారెడ్డి బంధువులు తనను కూడా అడ్డుకున్నారని మంత్రి అన్నారు.

Related posts

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మల ,పొంగులేటి ప్రకంపనలు!

Drukpadam

వి హెచ్ కాంగ్రెస్ ను వీడను న్నారా ?

Drukpadam

కాంగ్రెస్ లో లొల్లి… కార్యకర్తల పరేషాన్ …

Drukpadam

Leave a Comment