Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

భార్యాభర్తలను ఒకేచోటుకి చేర్చుతానన్న సీఎం కేసీఆర్ మాటనిలబెట్టుకోవాలి!

భార్యాభర్తలను ఒకేచోటుకి చేర్చుతానన్న సీఎం కేసీఆర్ మాటనిలబెట్టుకోవాలి!
-భార్యాభర్తల బదిలీలను వెంటనే చేపట్టాలని డిమాండ్
-ఖమ్మం కలెక్టరేట్ ముందు స్పౌజ్ ఉపాధ్యాయుల ధర్నా…

భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తూ వేరు వేరు చోట్ల ఉన్నవారిని ఒకేచోటకు చేరుస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకొని తమకు న్యాయం చేయాలనీ స్పావుజ్ ఉపాద్యాల కార్యాచరణ కమిటీ ఆధ్వరంలో ఖమ్మం కలెక్టరేట్ ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టారు . పిల్లలతో సహా వచ్చి పాల్గొన్న ఈ ఆందోళన కార్యక్రమం వినూత్నంగా సాగింది. చిన్నారులైన పిల్లలు తమ అమ్మానాన్నలను ఒకేచేత చేర్చి మాకు న్యాయం చేయాలనీ ప్లేకార్డు లు ప్రదర్శించిన తీరు ఆకట్టుకున్నది .ధర్నా ,ప్రదర్శన అనంతరం వారు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు .

రాష్ట్రంలో 317 జీవో వలన వేరు చేయబడిన భార్యాభర్తలను సుమారు 1800 మందిని ఒకే చోటికి చేర్చాలని మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే విద్యాబోధన సజావుగా సాగుతుంది . కానీ 317 జీవో వలన భార్యాభర్తలు వేరు వేరు చోట ఉండటం వలన పిల్లల బాగోల్ని పట్టించుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి . సీఎం సైతం భార్యాభర్తలను ఒకే చోటికి తీసుకువస్తానని మానవతా దృక్పథంతో ఒకే చోటుకు చేరుస్తానని హామీ ఇచ్చారు . దయచేసి మా కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని భార్యాభర్తలను ఒక చోటికి చేర్చి మా కుటుంబాలను పిల్లలను కాపాడాలని , విద్యాభివృద్ధికి దోహదపడాలని మనవి చేస్తున్నాము . ఈ విషయంపై ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేసి జిల్లా కలెక్టర్ కి మెమోరాండం ఇవ్వటం జరిగింది . ఈ కార్యక్రమంలో స్పాజ్ ఫోరమ్ అధ్యక్షులు బి. అమ్రు.కామ్ , కన్వీనర్ విజయ్ , వెంకటేశ్వర్లు , శశిధర్ , సుభాషిణి , పద్యం , సక్కుబాయి , శ్రీనివాస్ , నరసింహారావు , మాధురి, రాజ్యలక్ష్మి , మాధవి , స్వర్ణలత , కవిత , సుభాషిని తదితరులు పాల్గొన్నారు .

Related posts

Staples Has Discounted The iPad Mini 4 By $100

Drukpadam

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ

Drukpadam

ఖమ్మంలో కార్పోరేషన్ లో బీజేపీ బోణి

Drukpadam

Leave a Comment