Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాజగోపాల్ రెడ్డి నిర్ణయం …వెంకటరెడ్డికి నష్టం కలిగిస్తుంది…విహెచ్

కోమటిరెడ్డి నిర్ణయం ఆయన సోదరుడికి కూడా నష్టం కలిగిస్తుంది: వి.హనుమంతరావు!

  • కేసీఆర్ ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్న రాజగోపాల్ రెడ్డి
  • పార్టీ నుంచి వెళ్లిపోతున్నా అనే వారితో ఏం మాట్లాడతామన్న వీహెచ్
  • ఇబ్బంది ఉంటే అధిష్ఠానంతో మాట్లాడాలని సూచన

తెలంగాణలో కేసీఆర్ ను ఓడించే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందంటూ కాంగ్రెస్ కీలక నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపాయి. పార్టీ మారడం చారిత్రక అవసరమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో, కోమటిరెడ్డికి నచ్చజెప్పేందుకు ఆ పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క నిన్న ఆయన ఇంటికి వెళ్లి చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు.

మరోవైపు కోమటిరెడ్డి వ్యవహారంపై పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోతున్నా అనే వారితో ఏం మాట్లాడతామని ఆయన అన్నారు. పార్టీ మారాలనే కోమటిరెడ్డి నిర్ణయం సరికాదని వీహెచ్ చెప్పారు. టీఆర్ఎస్ ను ఓడించే బలం బీజేపీకి ఎక్కడుందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని తమ పార్టీ నాయకుడే అంటే తానేం మాట్లాడతానని అన్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్తే… ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా నష్టమేనని చెప్పారు. రాజగోపాల్ రెడ్డికి ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీ అధిష్ఠానంతో మాట్లాడాలని సూచించారు. ఈ అంశంపై తాను పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చిస్తానని తెలిపారు.

VH response on Komatireddy Raj Gopal Reddy

Related posts

రాష్ట్రపతి బరిలో శరద్ పవార్.. రాజకీయవర్గాలలో ఆశక్తికర చర్చ

Drukpadam

ఏ బాధ్యతలు అప్పగించినా పని చేస్తా: ఢిల్లీలో బండి సంజయ్

Ram Narayana

సిటీ బ‌స్సులో ఫుట్‌బోర్డు ప్ర‌యాణం చేసిన ఎమ్మెల్యే!

Drukpadam

Leave a Comment