Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాహుల్ ను ప్రధాని చేయడమే లౌకిక వాదుల లక్ష్యమై ఉండాలి …భట్టి

అజాదీకా పాదయాత్రలో భట్టీ

రాహుల్ ను ప్రధానిని చేయడమే లౌకికవాదుల లక్ష్యమై ఉండాలి

బిజెపి, ఆర్ఎస్ఎస్ మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక, ప్రజాస్వామికవాదులు ఏకమవ్వాలి

సంపన్నులకి ఇచ్చిన సబ్సిడీలు ఎంత? పేదలకు వెచ్చించిన సంక్షేమ నిధులు ఎంతనో శ్వేత పత్రం విడుదల చేయాలి

ప్లానింగ్ కమిషన్ ఎత్తివేయడం దేశాభివృద్ధికి గొడ్డలి పెట్టు

ఆరు రోజుల్లో 90 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన సిఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఖమ్మం జిల్లా పెనుబల్లి లో ముగిసిన ఆజాదీ కా గౌరవ్ యాత్ర

మతోన్మాదుల నుంచి దేశాన్ని రక్షించడానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లౌకిక, ప్రజాస్వామిక వాదుల లక్ష్యమై ఉండాలని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ఆజాదీ కా గౌరవ్ యాత్ర ఆరవ రోజు సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలంలోని ఖాన్ ఖాన్ పేట నుంచి కల్లూరు క్రాస్ రోడ్, ఆర్కే పురం, టేకులపల్లి, పెనుబల్లి మండల కేంద్రం వరకు కొనసాగింది. కూసుమంచి నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఆరు రోజుల్లో 90 కిలోమీటర్ల మేర పూర్తి చేసుకున్నది. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తో కలిసి
ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రజల ఉద్దేశించి భట్టి ప్రసంగించారు. దేశంలో బిజెపి, ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకికవాదులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బిజెపి వ్యతిరేక శక్తులు రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయడం లౌకిక వాదాన్ని బలోపేతం చేయడమే అవుతుందన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సమతా భావాన్ని జాతీయోద్యమ సంగ్రామ స్ఫూర్తిని 75వ స్వాతంత్రం వజ్రోత్సవాలను పురస్కరించుకొని దేశంలో నిలబెట్టుకోవాలన్నారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీని పట్టపగలు దారుణంగా హత్య చేసిన
ఆర్ఎస్ఎస్ భావాజాలం కలిగిన గాడ్సే బిజెపి నేతలకు నాయకుడని కొనియాడడం దేశద్రోహం కాద అని ప్రశ్నించారు. దేశంలో జాతీయ వాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడటం జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ తోనే సాధ్యం అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ వ్యవస్థలను బిజెపి కూల్చివేస్తున్నదని మండిపడ్డారు. ప్లానింగ్ కమిషన్ ను ఎత్తివేయడం, పంచవర్ష ప్రణాళికలు లేకుండా చేయడం దేశాభివృద్ధికి మోడీ వ్యతిరేకి అనడానికి ఇంతకంటే ఏమి నిదర్శనం కావాలన్నారు. సిబిఐ, ఐటి, ఈడి వ్యవస్థలను
ప్రశ్నించే గొంతులను, ప్రతిపక్షాలను అలగదొక్కడానికి భారతీయ జనతా పార్టీ తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నదని విమర్శించారు. ఎయిర్ ఇండియాను ఇప్పటికే అమ్మివేసిన బిజెపి ప్రభుత్వం భారతీయ రైల్వే ను ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. వేల కోట్ల విలువైన బొగ్గు గనులను ప్రైవేటు పేరిట బహుళ జాతి సంస్థలకు దాదా దత్తం చేయడానికి మోడీ సర్కార్ యోచిస్తున్నదన్నారు. పేదలు సామాన్య, మధ్యతరగతి వర్గాలు బీమా డబ్బులు దాచుకునే ఎల్ఐసి ని ప్రైవేటుపరం చేస్తున్నదన్నారు. గరీబి హఠావో నినాదం తీసుకొచ్చి దేశంలో పేదరిక నిర్మూలనకై కూడు గూడు గుడ్డలో భాగంగా దేశంలోని నిరుపేదలు మూడు పూటలా కడుపునిండా అన్నం తినడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన రేషన్ దుకాణాలను ఎత్తివేసి పేదలు తినే తిండిని కూడా దూరం చేయాలని మోడీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బహుళ జాతి సంస్థలకు, వ్యాపార దిగ్గజాలకు, పారిశ్రామికవేత్తలకు అధికారంలోకి వచ్చిన ఈ 8 సంవత్సరాల కాలంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలు, రాయితీలు ఎంత? పేదల బతుకుదెరువు కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు వెచ్చించిన ఖర్చు ఎంతనో లెక్కలతో సహా మోడీ సర్కార్ శ్వేత విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ సిద్ధాంతమే ఈ దేశానికి శ్రీరామరక్ష అని గాంధీజంను ప్రచారం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కల్లూరు కాంగ్రెస్ మండల నాయకులు ప్రజాప్రతినిలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

90 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న పాదయాత్ర

75వ స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలోని పాలేరు ఖమ్మం వైరా సత్తుపల్లి నియోజకవర్గాల్లోని ఆయా గ్రామాల్లో చేపట్టిన ఆజాదీ కా గౌరవ్ యాత్ర ఆరు రోజుల్లో 90 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నది. సోమవారం కూసుమంచి శివాలయం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర ఆదివారం రాత్రి పెనుబల్లి మండల కేంద్రానికి చేరుకొని ముగిసింది. ఆరు రోజుల పాటు సాగిన పాదయాత్రకు వేల సంఖ్యలో ప్రజలు ఎదురొచ్చి ఘనంగా స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. వైరాలో 5 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించగా కొనిజర్ల మండలానికి చేరుకున్న సందర్భంగా వివిధ సాంస్కృతిక కళాకారులతో కలిపి 2వేల మందితో ర్యాలీ నిర్వహించి జాతీయోద్యమ భావాలను స్వాతంత్ర సంగ్రామ స్ఫూర్తి గురించి ప్రజలకు చాటి చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు మదిర నియోజకవర్గంలో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర తర్వాత ఖమ్మం జిల్లాలో ఆజాదీ కా గౌరవ్ యాత్ర పేరిట నిర్వహించిన పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది. గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ బలోపేతం విస్తరణకు దోహదపడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కాంగ్రెస్ భావాజాలాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళడానికి ఈ పాదయాత్రలు ఎంతగానో ఉపయోగపడ్డాయనే టాక్ వినిపిస్తున్నది.

Related posts

ఖమ్మం గ్రానైట్ తో ఢిల్లీలో బోసు విగ్రహం ఏర్పాటు!

Drukpadam

డిగ్రీ చదువుకుంటూనే నెలకు రూ.10 వేల వేతనం!

Drukpadam

ఆకాశం నుంచి చచ్చిన చేపల వర్షం!

Drukpadam

Leave a Comment