Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

భట్టి పాదయాత్రకు విహెచ్ సంఘీభావం…

భట్టి పాదయాత్రలో విహెచ్

భట్టి పాదయాత్రకు విహెచ్ సంఘీభావం

75వ స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కమాజీమంత్రి సంభాని చంద్రశేఖర్ లు చేపట్టిన ఆజాదీ కా గౌరవ్ యాత్ర ఆరవ రోజు సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలంలోని ఖాన్ ఖాన్ పేట నుంచి కల్లూరు క్రాస్ రోడ్, ఆర్కే పురం, టేకులపల్లి, పెనుబల్లి మండల కేంద్రం వరకు కొనసాగింది. టేకులపల్లి వద్దకు పాదయాత్ర చేరుకున్న సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు విహెచ్ హనుమంతరావు భట్టి పాదయాత్రకు స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు.

బోనాలతో మహిళల స్వాగతం
టేకులపల్లి గ్రామానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకొని భట్టి పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. పాదయాత్రలో అడుగులో అడుగులు వేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.

Related posts

విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన 1400 ఎకరాల భూముల విక్రయ ప్రక్రియ ప్రారంభం

Ram Narayana

తమిళనాడు సీఎం స్టాలిన్ పై పరువునష్టం దావా!

Drukpadam

పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌కు షాక్‌.. అవిశ్వాసంపై ఓటింగ్ త‌ప్ప‌ద‌న్న సుప్రీంకోర్టు

Drukpadam

Leave a Comment