Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

కరోనా దెబ్బకి చైనాలో అతిపెద్ద షాపింగ్ మహల్ మూసివేత …

కరోనా దెబ్బకి చైనాలో అతిపెద్ద షాపింగ్ మహల్ మూసివేత …
-చైనాలోని ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ మార్కెట్ మూత
-షెంజెన్ మార్కెట్ ను మూసివేసిన చైనా
-కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడంతో చర్య
-జీరో కోవిడ్ విధానాన్ని అమలు చేస్తుండడం వల్లనే షాపింగ్ మూసివేసినట్లు ప్రచారం
-ఇంట్లోనే ఉంటూ, రోజువారీగా పరీక్షలు చేయించుకోవాలంటూ ఆదేశాలు

గత రెండు సంవత్సరాలకు పైగా ప్రపంచాన్నికుదిపేసిన కరోనా నేడు చైనాలో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అందులో భాగంగానే చైనా ప్రభుత్వం కొన్ని కఠిన చర్యలు తుసుకుంటుంది.కరోనా జీరో కేసులను అమలు చేయాలనీ గట్టి పట్టుదలతో ఉన్న చైనా ప్రభుత్వం ఎక్కడ చిన్న కేసువు వచ్చిన ఆప్రాంతాన్ని పూర్తిగా మూసి వేస్తుంది. అందులో భాగంగానే ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ గా ఉన్న షెంజెన్ మార్కెట్ ను చైనా మూసివేసింది.

ప్రపంచంలోనే అతి పెద్దదైన చైనాలోని షెంజెన్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ మూతపడింది. ఇది ప్రపంచంలో అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్. షెంజెన్ పట్టణంలో కొన్ని రోజులుగా కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడంతో చైనా సర్కారు మార్కెట్ ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. చైనా సర్కారు జీరో కోవిడ్ విధానాన్ని అమలు చేస్తుండడం తెలిసిందే. ఇందులో భాగంగా ఒక్క కేసు వచ్చినా ఆయా ప్రాంతాలను పూర్తిగా కట్టడి చేస్తుంది.

వచ్చే గురువారం వరకు వ్యాపారాలను మూసివేయాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ మార్కెట్ మూతపడింది. అందరూ తమ ఇళ్లల్లోనే ఉండిపోవాలని, రోజువారీగా న్యూక్లియిక్ యాసిడ్ టెస్ట్ చేయించుకోవాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. టెలికం ఎక్విప్ మెంట్ లో దిగ్గజ సంస్థ హువావే, చైనాకు చెందిన సెమీకండక్టర్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ ఇంటర్నేషనల్ కార్ప్, యాపిల్ సరఫరాదారు ఫాక్స్ కాన్ టెక్నాలజీ ఇలా ప్రపంచ దిగ్గజ సంస్థలకు షెంజెన్ ప్రధాన కేంద్రంగా ఉంది.

Related posts

ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ దన్ను…

Drukpadam

చైనాలో కరోనా ప్రళయం.. ఒకే రోజు 3.7 కోట్ల మందికి వైరస్!

Drukpadam

దేశంలో కరోనా పరిస్థితులపై నోరు మూసుకుని కూర్చోలేం: సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

Drukpadam

Leave a Comment