Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆస్ట్రా జనికా వ్యాక్సిన్ నిషేదించిన డెన్మార్క్

  • ఆస్ట్రా జనికా వ్యాక్సిన్ నిషేదించిన డెన్మార్క్
  • వాడటం వాడకపోవడం ఆయాదేశాల ఇష్టం ప్రపంచ ఆరోగ్యసంస్థ
  • వ్యాక్సిన్ తయారీకి సంబందించిన అన్ని రిపోర్టులను అందించేందుకు సిద్ధం
  • రిస్క్ అనుకుంటే టీకాలు వద్దు

కరోనా నివారణ కోసం ప్రపంచవ్యాపితంగా అనేక దేశాలు అనేక రకాల వ్యాక్సిన్లు తయారు చేశాయి. అందులో ఆస్ట్రా జనికా అనేది ఒక వ్యాక్సిన్ . కరోనా రాకుండా వేసుకునే ఈ టీకాను ప్రపంచ వ్యాపితంగా విడుదల చేశారు. బ్రిటిష్ స్వీడిష్ ఫార్మ్ దిగ్గజం ఆక్స్ ఫార్డ్ యూనివర్సిటీ తో కలిసి అభివృద్ధి చేసిన ఆస్ట్రా జనికా వ్యాక్సిన్ సమర్థతపై తొలినుంచి అనుమానాలు వ్యక్తం అయ్యాయి.ఈ టీకా తీసుకున్న పలువురిలో ప్రతికూల ప్రభావాలు కనిపించాయి. వంట్లో రకటం గడ్డలు కట్టి కొన్ని రోజుల తరువాత మరణాలు సంభవించినట్లు ఫిర్యాదులు వచ్చాయి.దింతో డెన్మార్కుతో సహా డజనుకు పైగా దేశాలు ఆస్ట్రా జనికా టీకాను తాత్కాలికంగా నిషేధించాయి. కొన్ని రోజులు తరువాత పలుదేశాల్లో తిరిగి ఆస్ట్రా జనికా టీకాను తీసుకోవటం మొదలు పెట్టిన డెన్మార్క్ దేశం మాత్రం ఆస్ట్రాజెనికను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రా జనికా వ్యాక్సిన్ తీసుకున్న పలువురిలో రక్తం గడ్డకట్టడం గుర్తించామని వారిలో ఇద్దరి పరిస్థితి విషమించి ,ఒకరు ప్రాణాలు కోల్పోయారని డెన్మార్క్ తెలిపింది. మొదట తాత్కాలిక నిలిపివేత అనంతరం పలు పరిశీలనల అనంతరం అన్ని రిపోర్టులు సమగ్రంగా విచారించిన తరువాతనే ఆస్ట్రా జనికా శాశ్వతంగా నిలిపివేయాలని నిర్ణయానికి వచ్చామని డెన్మార్క్ ఆరోగ్య శాఖ డైరక్టర్ బ్రోస్ట్రోమ్ మీడియాకు వెల్లడించారు.ఆస్ట్రా జనికా వదిలేయగా మిగతా అందుబాటుల ఉన్న వ్యాక్సిన్ టీకాల ప్రక్రియ కొనసాగిస్తామని అన్నారు. దీనివల్ల జులై నాటికీ పూర్తీ కావలిసిన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆగస్టు వరకు కొనసాగే ఆవకాశం ఉందని అన్నారు.


రిస్క్ అనుకుంటే టీకాలు వద్దు

రక్తం గడ్డ గడుతుందనే ఫిర్యాదుల అనంతరం ఆస్ట్రా జనికా తో పాటు ఇతర వ్యాక్సిన్లు సురక్షితమైనవే నాని వాటి వినియోగాన్నికొనసాగించవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ ,ఐరోపా ఔషధ నియంత్రణ సంస్థలు ఇదివరకే ప్రకటన చేశాయి.అయితే ఏదైనా దేశం కోవిద్ మరణాలకంటే వ్యాక్సిన్ సేడ్ ఎఫెక్ట్ మరణాలు తీవ్రత ఎక్కువని భావించిన పక్షంలో సదరు వ్యాక్సిన్లను నిలిపి వేయాలా వద్దా అనేది ఆయా ప్రభుత్వాల నిర్ణయమని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ చేతులెత్తేసింది ఆస్ట్రా జనికా నిలిపివేత ఒక్క డెన్మార్కుతోనే ఆగుతుందా ఇతర దేశాలు కూడా అదే బాటలో పయనిస్తాయా అనేది చూడాలి మరి !

Related posts

ఆ ఐదు ఔషధాల తయారీని నిలిపివేయండి..’పతంజలి’కి ఆదేశాలు!

Drukpadam

92 ఏళ్ల వయసులో ఐదో పెళ్లికి రెడీ అవుతున్న మీడియా మొఘల్ రూపర్ట్ మర్దోక్!

Drukpadam

బెంగాల్ పర్యటనలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత!

Drukpadam

Leave a Comment