Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తిరుపతి పార్లమెంట్ ,నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు ముగిసిన ప్రచారం..

తిరుపతి పార్లమెంట్ ,నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు ముగిసిన ప్రచారం..
రేపే పోలింగ్ ….కట్టుదిట్టమైన ఏర్పాట్లు
-కరోనా నిబంధనల నడుమ జరగనున్న పోలింగ్
మే 2న ఓట్ల లెక్కింపు
ఈ సాయంత్రం నుంచి 144 సెక్షన్
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు- పోలిసుల హెచ్చరిక
తెలుగు రాష్ట్రాలలో జరగుతున్న తిరుపతి పార్లమెంట్ కు ,నాగార్జున సాగర్ అసెంబ్లీ కి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది . రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నిన్న సాయంత్రంనుంచి ప్రచారం ముగియటంతో మైకులు మూగపోయాయి. నిన్నటి వరకు సందడి చేసినపల్లెలో నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నది . vivida ప్రాంతాల నుంచి వచ్చిన మంత్రులు , ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇతర నేతలు నియోజకవర్గాన్ని విడిచి పోవాలని పోలీసులు ఆదేశించటంతో వారు వెళ్లిపోయారు.కొందరు పక్కనే ఉన్న నియోజక వర్గాలలోని పట్టణాలలో మకాం వేశారు. పోలింగు కు అన్ని ఏర్పాట్లు చేసిన అధికార యంత్రంగం సిబ్బందిని ఆయాగ్రామాలకు తరలించే ఏర్పాట్లలో ఉంది. తిరుపతి లో ఏడు అసెంబ్లీ నియోజవర్గాల పరిధిలో 17 లక్షల ఓటర్లు , 2440 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ,సాగర్ అసెంబ్లీ లో 2 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
————————————————-
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక
————————————————-

తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికకు నేటి సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసింది. ఇక, ఈ నెల 17న పోలింగ్ చేపట్టి, మే 2న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక బరిలో 28 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తిరుపతి లోక్ సభ స్థానం పరిధిలో 17 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. 2,440 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఉప ఎన్నిక నేపథ్యంలో తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 144 సెక్షన్ విధించారు. ఈ సాయంత్రం నుంచి ఈ నెల 18వ తేదీ రాత్రి 7 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. ఐదుగురికి మించి గుమికూడడం, గుంపులుగా తిరగడంపై నిషేధం విధించారు. లౌడ్ స్పీకర్లతో సమావేశాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
————————————————————-

నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక
————————————————————–

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ప్రచారం నిన్న సాయంత్రం 5గంటలతో ముగిసింది. ఎన్నికను టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో మూడు పార్టీల కీలక నేతలు ఇక్కడే మకాం వేసి ప్రచారాన్ని వేడెక్కించారు. అధికార పార్టీ తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం కేసీఆర్‌ బహిరంగ సభతో విమర్శలు ప్రతివిమర్శలు చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు, కీలక నేతలు, స్టార్‌ క్యాంపెయినర్లు అధికార పార్టీకి దీటుగా ప్రచారాన్ని కొనసాగించి ఢీ అంటే ఢీ అన్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో గ్రామగ్రామాన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో అన్ని పార్టీల అభ్యర్థులు, వారికి మద్దతుగా వచ్చిన నేతలు సందడి చేశారు. గురువారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడగా, కొద్ది రోజులుగా రాజకీయ నేతల ప్రచారాలు, మైకులతో హోరెత్తిన నియోజకవర్గంలో ఒక్కసారిగా నిశబ్ధం ఏర్పడింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి సాగర్‌లో మకాం వేసిన అన్ని పార్టీల నేతలు ప్రచార సమయం ముగియడంతో కొందరు ఇంటిదారి పట్టగా , మరికొందరు పోలింగ్ ముగిసేవరకు పక్క నియోజకవర్గాలలో ఉండాలనే పార్టీ ఆదేశాల మేరకు అక్కడ మకాం వేషాలు. ప్రచారం ముగియడంతో ఎన్నిక నిర్వహణకు అధికారులు, పోలీసుల హడావుడి మొదలైంది. సాగర్‌ ఉప ఎన్నిక ఈ నెల 17న జరగనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 2లక్షల మందికి పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనుండగా; ఇందుకోసం 346 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Related posts

This Friendship Day #LookUp To Celebrate Real Conversations

Drukpadam

కరోనాతో చనిపోతామనే భయం ఆధారంగా ముందస్తు బెయిల్ ఇవ్వలేము: సుప్రీంకోర్టు

Drukpadam

ఇమ్రాన్ ఖాన్ ‘ఆజాదీ మార్చ్’పై పాక్ రక్షణ మంత్రి తీవ్ర ఆరోపణలు..

Drukpadam

Leave a Comment