Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గ్రీన్ కార్డ్ విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన బైడెన్ సర్కార్…

గ్రీన్ కార్డ్ విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన బైడెన్ సర్కార్…

  • గ్రీన్ కార్డుల విషయంలో కీలక ఆంక్షలు విధించిన గత ట్రంప్ సర్కార్
  • అన్ని నిబంధనలను పక్కన పెట్టేసిన బైడెన్ ప్రభుత్వం
  • ఆదాయం, సబ్సిడీలతో సంబంధం లేకుండా అందరూ గ్రీన్ కార్డ్ కు అర్హులే

అమెరికాలో గ్రీన్ కార్డు పొందటం అంటే అంట ఆషామాషీ కాదు …అక్కడకి వెళ్లే వివిధ దేశాలవారికి గ్రీన్ కార్డు రావడం శుభవార్త ..అలాంటి కార్డు కోసం చేయని ప్రయత్నమంటూ ఉండదు . అలాంటి కార్డు కోసం అమెరికా ప్రభుత్వం ముందుకు వచ్చింది సులభమైన పద్దతులను తెచ్చింది బైడెన్ ప్రభుత్వం .

జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి వలసదారులకు అనుకూలంగా నిర్ణయాలను తీసుకుంటూ వస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలను పక్కన పెట్టేసి… వలసదారులను సంతృప్తిపరచే నిర్ణయాలను అమలు చేస్తున్నారు. అల్పాదాయ వర్గాలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను రద్దు చేస్తున్నారు. ఆదాయం, ప్రభుత్వ సబ్సిడీలతో సంబంధం లేకుండా ఎవరైనా గ్రీన్ కార్డులు పొందేందుకు అర్హులని బైడెన్ ప్రభుత్వం తెలిపింది. ఈ నిబంధనలు డిసెంబర్ 23 నుంచి అమల్లోకి రానున్నాయి. 

గత ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ కార్డ్ జారీకి సంబంధించి పలు ఆంక్షలను విధించింది. ఫుడ్ స్టాంపులు, హౌసింగ్ వోచర్లు, మెడికల్ సాయం పొందిన వారికి గ్రీన్ కార్డులను నిరాకరించింది. అంతేకాదు, వలసదారుల ఆదాయం, వయసు, ఆరోగ్య పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకునేది. వీటన్నింటినీ పక్కన పెట్టిన బైడెన్ ప్రభుత్వం.. గ్రీన్ కార్డుల జారీకీ వీటిని పరిగణనలోకి తీసుకోకూడదని నిర్ణయించింది. దీంతో, అమెరికాలో ఉంటున్న ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారికి పెద్ద ఊరట లభించినట్టయింది. ముఖ్యంగా ఎన్నారైలకు దీన్ని అతి పెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చు.

Related posts

పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు…

Ram Narayana

అమిత్ షా వ్యాఖ్యలకు శరద్ పవార్ కౌంటర్…

Ram Narayana

ఖమ్మం జిల్లాలో అసాంఘిక శక్తులపై ఉక్కు పాదం ;సీపీ విష్ణు ఎస్ వారియర్!

Drukpadam

Leave a Comment