విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ ఇమ్రాన్ ఖాన్!
- ఇస్లామాబాద్ నుంచి గుజ్రన్ వాలాకు బయల్దేరిన ఇమ్రాన్
- విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం
- రోడ్డు మార్గంలో గుజ్రన్ వాలాకు వెళ్లిన ఇమ్రాన్
పాకిస్తాన్ మాజీ ప్రధాని ప్రపంచ క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు . ఆయన గుజ్రాన్ వాలా లో లోకసభలో పాల్గొనేందుకు ఇస్లామాబాద్ నుంచి బయలుదేరారు . విమానం బయలుదేరిన కొద్దీ సేపటికే సాంకేతిక లోపంతో తిరిగి ల్యాండ్ కావడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురైయ్యారు. అందులో ఉన్న ఇమ్రాన్ అక్కడ నుంచి రోడ్ మార్గం ద్వారా గుజ్రాన్ వాలా కు కారులో బయలుదేరడంతో పార్టీ కార్యకర్తలు , ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు . పదవినించి దిగిపోయిన తర్వాత ఇమ్రాన్ పై దాడులు జరిగే అవకాశం ఉందని అనుమానాలు ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ సర్కార్ అప్రమత్తమైంది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, ప్రపంచ క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే ఇస్లామాబాద్ నుంచి గుజ్రన్ వాలాకు ఈరోజు ఆయన ప్రత్యేక విమానంలో బయల్దేరారు. అయితే టేకాఫ్ అయిన వెంటనే విమానంలో అకస్తాత్తుగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో, ఆయన ప్రయాణిస్తున్న విమానం మళ్లీ వెంటనే ల్యాండ్ అయింది. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో గుజ్రన్ వాలాకు వెళ్లారు. అక్కడ జరిగిన సభలో ఆయన భారత్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కూడా రష్యా నుంచి ఇండియా చమురును కొనుగోలు చేసిందని ప్రశంసించారు.