నాగార్జున సాగర్ ఉపఎన్నికలో రికార్డ్ స్థాయిలో 88 శాతం పోలింగ్
-గతంలో ఎన్నడూ జరగని విధంగా పోలింగ్ జగడంపై ఆశ్చర్యం
-ఇది ఎవరికీ అనుకూలంగా ఉంటుందోనని అంచనాలు
-కచ్చితంగా తమకే అనుకూలం అంటున్న కాంగ్రెస్
-ప్రభుత్వ పథకాలకు ప్రజలు ఆకర్షితులైయ్యారని అంటున్న టీఆర్ యస్
-ప్రజలు మోడీ పాలనా కావాలని కోరుకుంటున్నారంటున్న బీజేపీ
-సాయంత్రం 6 తర్వాత కొవిడ్ రోగులకు ఓటేసే అవకాశం
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో 88 శాతం తో భారీ పోలింగ్ నమోదైంది.ఇది ఈ నియోజకవర్గంలోనే రికార్డు అని అంటున్నారు . ఇంట భారీ స్థాయిలో ఇప్పుడు ఎక్కడ పోలింగ్ జరగలేదు. దీంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని మరో రెండు ఘంటలు పొడిగించటంతో పాటు ఎన్నికల ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగటంతో పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు . సాయంత్రం 7 గంటలకు పోలింగ్ ముగిసే సరికి 88 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరిగింది. కరోనా నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం రెండు గంటల పాటు పొడిగించింది. ఈ ఎన్నికలో మొత్తం 41 మంది బరిలో నిలిచారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున నోముల భగత్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కుందూరు జానారెడ్డి, బీజేపీ నుంచి రవి నాయక్ బరిలో నిలిచారు. ఎవరికీ వారు భారీ పోలింగ్ తమకే అనుకూలంగా ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులూ ఎక్కువపోలింగ్ జరగటం ప్రభుత్వ కు అడ్డం పడుతుందని తమ నాయకుడు జానారెడ్డి కి భారీ మైజార్టీ ఖాయమని అంటున్నారు.ప్రభుత్వ పథకాలకు ఆకర్హిసితులైన ప్రజల రాష్ట్రాన్ని కేసీఆర్ నాయకత్వం అవసరమని భావించి ఓట్ల రూపం లో తమ అభిమానాన్ని చాటుకున్నారని చెబుతున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంపై నమ్మకంతోనే తెలంగాణాలో బీజేపీ రావాలని ప్రజలలో ఉన్న బలమైన కోరికకు పోలింగ్ శాతం పెరగటం ప్రబలానిదర్శనం అని బీజేపీ చెబుతుంది.
మధ్యాహ్నం 3 గంటల వరకు 69 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు చేపట్టనున్నారు. ఆపై, అప్పటివరకు క్యూలో ఉన్నవారితో పాటు, కొవిడ్ రోగులకు రాత్రి 7 గంటల వరకు ఓటేసే అవకాశం కల్పిస్తారు. మధ్యాహ్నంతో పోల్చితే సాయంత్రం అయ్యేకొద్దీ ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు భారీగా తరలివస్తున్నారు. సాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక సందర్భంగా 346 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. నాగార్జునసాగర్ బరిలో టీఆర్ఎస్ తరఫున నోముల భగత్, కాంగ్రెస్ తరఫున జానారెడ్డి, బీజేపీ తరఫున పానుగోతు రవికుమార్ పోటీ చేస్తున్నారు.