Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఊహించని పరిణామం.. నితీశ్ కుమార్ ను కలిసిన ప్రశాంత్ కిశోర్!

ఊహించని పరిణామం.. నితీశ్ కుమార్ ను కలిసిన ప్రశాంత్ కిశోర్!

  • పాట్నాలో నితీశ్ ను కలిసిన ప్రశాంత్ కిశోర్
  • దాదాపు రెండు గంటల సేపు కొనసాగిన సమావేశం
  • ఏయే అంశాలపై చర్చలు జరిపారనే విషయంపై రాని క్లారిటీ

బీహార్ ముఖమంత్రి నితీశ్ కుమార్ ను అనునిత్యం విమర్శించే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఈరోజు ఆయనతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. పాట్నాలో నితీశ్ తో ఆయన భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల సేపు వీరి సమావేశం కొనసాగినట్టు సమాచారం. అయితే, వీరు ఏయే విషయాల గురించి మాట్లాడుకున్నారనే విషయం మాత్రం తెలియరాలేదు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ పవన్ వర్మ కూడా పాల్గొన్నారు.

గతంతో నితీశ్ కుమార్ జేడీయూకు కూడా ప్రశాంత్ కిశోర్ పని చేశారు. 2015లో వ్యూహకర్తగా పని చేసి నితీశ్ విజయంలో కీలకపాత్రను పోషించారు. ఆ తర్వాత జేడీయూలో చేరి, కొంత కాలానికి బయటకు వచ్చేశారు. అప్పటి నుంచి నితీశ్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్… మళ్లీ పొత్తులను మార్చరనే గ్యారెంటీ ఏమీ లేదని పీకే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ రెండు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఎంత మాత్రం లేదని వ్యాఖ్యానించారు.

Related posts

కర్ణాటక సీఎం యడ్యూరప్ప కు సన్ స్ట్రోక్ తప్పదా ?

Drukpadam

మునుగోడులో గెలవబోతున్నాం: కేటీఆర్

Drukpadam

అమెరికాలో గన్ కల్చర్ …పాఠశాలలో విద్యార్థులు మధ్య ఘర్షణ కాల్పులు…

Drukpadam

Leave a Comment