Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

వివేకా హత్య పై ఏ బి వెంకటేశ్వరరావు కు కౌంటర్ ఎటాక్

వివేకా హత్య పై ఏ బి వెంకటేశ్వరరావు కు కౌంటర్ ఎటాక్
-కేసులో వైయస్ కుటుంబ సభ్యులను బంధువులను అరెస్ట్ చేయాలనీ దర్యాప్యు అధికారి రాహుల్ దేవ్ వర్మ పై వత్తిడి తెచ్చింది నిజం కదా ?
-ఆయన మీవత్తిడులకు తలొగ్గలేదుకదా
-డి జి స్థాయిలో ఉన్న వ్యక్తి డిపార్ట్మెంట్ పై నిందలు వేయడం తగునా
-అప్పుడు ఇంటలిజన్స్ చీఫ్ గా ఉన్న మీరు ఆనాడు ఎందుకు స్పందించలేదు
వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏ బి వెంకటేశ్వరరావు చేస్తున్న ఆరోపణలపై కౌంటర్ ఎటాక్ ప్రాంరంబమైంది . ఏ బి వెంకటేశ్వర్ రావు చేస్తున్న ఆరోపణలలో నిజంలేదని డి ఐ జి పాల్ రాజ్ ఖండించారు .ఆయన నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. హత్య జరిగినప్పుడు ఇంటలిజన్స్ చీఫ్ గా ఉన్న మీరు ఎందుకు వైయస్ కుటుంబసభ్యులను బంధువులను అరెస్ట్ చేయాలనీ వత్తిడి తెచ్చారని ప్రశ్నించారు. మీదగ్గర ఉన్న ఆధారాలను అప్పుడే ఎందుకు బయట పెట్టలేదని అన్నారు. మీరే ఎందుకు వివేకా కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న రాహుల్ దేవ్ వర్మ పై వైయస్ కుటుంబసభ్యులను అరెస్ట్ చేయాలనీ వత్తిడి తెచ్చారో చెప్పాలని అన్నారు.ఆయన మీరు చేసిన వత్తిడికి తలొగ్గని విషయాన్నీ మర్చిపోయారా అని సూటిగా ప్రశ్నించారు .ఏ బి వి పై కుత్రిమ డాక్యుమెంట్లు సృష్టించారని చెప్పడంలో ఏమాత్రం నిజంలేదన్నారు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న మీరు సహా అధికారులపై నిందలు వేయడం ,ఆరోపణలు చేయడం తగదన్నారు. ఆయన ఆరోపణలు అన్ని సర్వీస్ నిబంధలను విరుద్ధంగానే ఉన్నాయని ఇలాంటి ఆరోపణలు చేయడం డి జి హోదాలో ఉన్న వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం తగదని హితవు పలికారు

Related posts

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో తొలి అరెస్ట్‌..

Drukpadam

డిజిటల్ అరెస్ట్ పేరుతో యువతి బట్టలు విప్పించి నగదు కాజేసిన కేటుగాళ్లు.. ముంబైలో ఘటన!

Ram Narayana

ఇద్దరి ప్రాణాలు తీసిన గడ్డం గొడవ …!

Drukpadam

Leave a Comment