Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

లోటస్ పాండ్ లో దీక్ష విరమించిన షర్మిల… కేసీఆర్ పై ఆగ్రహం

లోటస్ పాండ్ లో దీక్ష విరమించిన షర్మిల… కేసీఆర్ పై ఆగ్రహం
-నిరుద్యోగ ఆత్మహత్యలన్నీ కేసీఆర్ హత్యలే షర్మిల తీవ్ర ఆరోపణలు
-ప్రతిపక్షాలపై విసుర్లు … డబ్బులకు అమ్మడు పోతున్నారని ఆరోపణలు
-ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు చేతులకు గాజులు దోడుక్కున్నాయి
ఇందిరా పార్క్ ధర్నా సందర్భంగా ఎ సి పి శ్రీధర్ అనుచితంగా ప్రవర్తించారని వ్యాఖ్య
-ఆయనపై కంప్లైంట్ డిజిపి తీసుకోకపోవడం దారుణమన్న షర్మిల
-నిమ్మరసం ఇచ్చి షర్మిల చేత దీక్ష విరమింప జేసిన నిరుద్యోగుల అమరవీరుని తల్లి
-రాష్ట్రంలో 60 లక్షల నిరుద్యోగులు వారికీ ఉపాధి కల్పించడమే తమ లక్ష్యం
-రెండేళ్లలో కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే సరే సరి
-లేకపోతె మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది
– అప్పుడు ఏమిచేసైనా అందరికి ఉద్యోగాలు కల్పిస్తా
-అప్పటుదాకా ఓపిక పట్టండి ఆత్మహత్యలు చేసుకోవద్దు
-రాజన్న బిడ్డగా మాట ఇస్తున్నా
నిరుదోగులకు కేసీఆర్ ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని ,ఖాళీగా ఉన్న లక్ష 90 వేళా ఉద్యోగాలను భర్తీ చేయాలనీ కోరుతూ వై యస్ షర్మిల చేప్పట్టిన నిరసన దీక్ష ఆదివారం ఆమె నివాసం లోటస్ పాండ్ లో విరమించారు. ఆమెకు నిరుద్యోగ అమరవీరుల కుటుంబానికి చెందిన ఒకతల్లి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప జేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కేసీఆర్ పైన ప్రభుత్వంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు 7 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేదు ఇక ఉద్యోగాలు రావని గుండె చెదిరిన తమ్ముళ్లు ఆత్మహత్యలే శరణ్యం అనుకుని అందుకు పూనుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వం నోటిఫికేషన్ రాకుండా ఉద్యోగాల కల్పనా లేకుండా పోవడానికి ఎవరు భాద్యులు పాలకులు కదా ? అందుకు కేసీఆర్ భాద్యుడు కదా ? అందువల్ల నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసీఆర్ భాద్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు రాక మరణించిన రవీంద్ర నాయక్ , మురళి , కుటుంబాలకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. వారికీ కన్నీళ్లు మీకు కనపడటంలేదా? ఇదేనా పాలనా ? అంటూ ప్రభుత్వంపై కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ చిటికేస్తే ఇచ్చే నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వడంలేదన్నారు. 2008 నాటి ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జంబో డి ఎస్ సి ఇచ్చిన విషయాన్నీ గుర్తు చేశారు. ప్రవేట్ రంగంలో సైతం 11 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా వైయస్సార్ దేనని అన్నారు. కేసీఆర్ చేతకాని తనం వల్లనే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడంలేదని ఆరోపంచారు. 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని వారందరికీ ఉద్యోగాలు కల్పించటమే తన లక్ష్యం అన్నారు.రాష్ట్రంలో నియంత పాలనా సాగుతుందని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించటడంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు,కేసీఆర్ పాలనా మరో రెండు సంవత్సరాలు ఉంది .ఈ రెండు సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే మంచిది ఇవ్వకపోతే మనప్రభుత్వం అధికారంలోకి వస్తుంది .అప్పుడు ఏమి చేసైనా నిరుద్యోగులుకు ఉద్యోగాలు కల్పించటమే లక్ష్యంగా పనిచేస్తానని రాజన్న బిడ్డగా హామిఇస్తున్నానని అన్నారు. తమ దీక్ష సందర్భంగా అనుచితంగా ప్రవర్తించిన ఎ సి పి శ్రీధర్ పై డీజీపీ కంప్లైంట్ తీసుకోక పోవటాన్ని ఆమె తప్పు పట్టారు. పోలీసులే లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు కేసీఆర్ మెప్పుకోసమా ఉద్యోగాలు చేస్తుందని అన్నారు. జై తెలంగాణ ,జైజై తెలంగాణ అంటూ ఆమె దీక్ష విరమించారు. అంతకు ముందు ఆమె ఖమ్మం సంకల్ప సభలో ప్రకటించినట్లు గానే ఈ నెల 15 న ఇందిరాపార్కులో దీక్ష చేపట్టారు. ఆమె మూడు రోజులు దీక్ష చేయాలనీ నిర్ణయించుకున్నప్పటికీ పోలీసులు ఒక్కరోజు దీక్షకు మాత్రమే అనుమతి ఇచ్చారు.ఆమె అక్కడ దీక్షను కొనసాగించేందుకు అనుమతి లేకపోవడంతో పాదయాత్రగా తన నివాసమైన లోటస్ పాండ్ కు బయలు దేరారు.పాదయాత్రకు అనుమతించని పోలీసులు ఆమెను తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద అడ్డుకున్నారు.పోలీసులను నెట్టుకుంటూ ఆమె ముందుకెళ్లే ప్రయత్నంలో జరిగిన తోపులాటలో ఆమె దుస్తులు చినిగి పోయాయి . నీరసంగా ఉన్న ఆమె సొమ్మసిల్లారు. ఆమె చేతి మణి కట్టుకు బలమైన దెబ్బ తగిలింది. మరికొందరు కార్యకర్తలు సైతం పెనుగులాటలో సొమ్మసిల్లారు. ఆమె ను అరెస్ట్ చేసిన పోలీసులు బేగంపేట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అక్కడనుంచి ఆమె నివాసమైన లోటస్ పాండ్ కు తరలించారు. ఆమె ముందుగా చెప్పినట్లుగానే తన దీక్షను మూడు రోజుల పాటు లోటస్ పాండ్ లో కొనసాగించారు.ఆదివారం దీక్షను విరమించారు. నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని పిలిపు నిచ్చారు.

Related posts

ఢిల్లీలో కాంగ్రెస్ నిరసనలు… రాహుల్ గాంధీ అరెస్ట్!

Drukpadam

బీఆర్ఎస్ కు ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా ఉపసంహరణ!

Drukpadam

షర్మిల ఖమ్మం టూర్ లో గిరిజనులతో ముఖాముఖీ

Drukpadam

Leave a Comment