Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తమ తొలగింపు చట్టవిరుద్ధం ….జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ అధ్యక్షులు సివి రావు ..

తమ తొలగింపు చట్టవిరుద్ధం ….జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ అధ్యక్షులు సివి రావు ..
సొసైటీ చట్టంలో అక్కడ ఆలా చెప్పలేదు
గౌరవ న్యాయస్థానాలు కూడా ఎక్కడ దీన్ని ప్రస్తావించలేదు
లేని అధికారాలను సొసైటీ అధ్యక్షడు ఆపాదించుకుంటున్నాడు
సొసైటీకి, క్లబ్ సభ్యత్వానికి ఎలాంటి సంబంధం లేదు

జూబ్లీ హిల్స్ సొసైటీ లో తనతో పటు ఐదుగురి సభ్యులను తొలగించినట్లు సొసైటీ అధ్యక్షుడు ప్రకటించడంపై సివిఆర్ ఛానల్ అధినేత జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ అధ్యక్షులు సివి రావు స్పందించారు . జనరల్ బాడీ సమావేశంలో తమను తొలగించినట్లు ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు . ఆ సమావేశంలో పాల్గొన్న సభ్యులు మాట్లాడేందుకు మైకు అడిగిన ఇవ్వలేదని అన్నారు . సొసైటీ బై లా ప్రకారం సభ్యులను తొలగించే హక్కు అధ్యక్షుడికి ఉండదని ఆ విషయాన్నీ తెలుసుకోకుండా ఆయన తమను తొలగించినట్లు ప్రకటించడం చెల్లదని అన్నారు . రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో సివి రావు తోపాటు ఎన్టీవీ ఛానల్ అధినేత నరేంద్ర చౌదరి మరో ముగ్గురి సభ్యత్వాలని రద్దు చేసినట్లు ప్రకటించిన సంగతి ఇదితమే .దీనిపై సివి రావు ఘాటుగానే స్పందించడం ఆసక్తిగా మారింది. మరి జూబ్లీ హిల్స్ సొసైటీ తాము తీసుకున్న చర్యలు చెల్లుబాటు కావంటూ సభ్యులు ప్రకటించడంపై ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరి !

Related posts

మోదీ ప్రారంభించిన 5 రోజులకే కోత‌కు గురైన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే…

Drukpadam

ఖమ్మం రూరల్ సీఐ శ్రీనివాస్ రావు బదిలీ… నెరవేరిన సిపిఐ కోరిక…

Drukpadam

ఆస్ట్రేలియాలోని ఓ పట్టణంలో ఆకాశంలో గులాబీ రంగు వెలుగు…

Drukpadam

Leave a Comment