Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వాన్‌పిక్ భూముల‌ను జ‌ప్తు నుంచి విడుద‌ల చేయండి… ఈడీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం…

వాన్‌పిక్ భూముల‌ను జ‌ప్తు నుంచి విడుద‌ల చేయండి… ఈడీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం…

  • జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో వాన్‌పిక్ భూముల‌ను జ‌ప్తు చేసిన ఈడీ
  • ఆ భూముల్లో 1,416 ఎక‌రాల‌ను జ‌ప్తు నుంచి విడుద‌ల చేయాల‌న్న తెలంగాణ హైకోర్టు
  • మిగిలిన 11,804 ఎక‌రాల‌పై న‌వంబ‌ర్ 14న విచార‌ణ‌

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై న‌మోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ హైకోర్టు మంగ‌ళ‌వారం మ‌రో కీల‌క తీర్పు చెప్పింది. జ‌గ‌న్ కేసుల్లో వాన్‌పిక్‌కు చెందిన భూముల‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) జ‌ప్తు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ భూముల్లో 1,416 ఎక‌రాల‌ను జ‌ప్తు నుంచి విడుద‌ల చేయాలంటూ ఈడీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ భూములు మిన‌హా మిగిలిన 11,804 ఎక‌రాల వాన్‌పిక్ భూముల జ‌ప్తుపై న‌వంబ‌ర్ 14న విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు హైకోర్టు తెలిపింది.

జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో వాన్‌పిక్ ప్రాజెక్టుకు చెందిన మొత్తం 13 వేల‌కు పైగా ఎక‌రాల భూముల‌ను ఈడీ జ‌ప్తు చేసింది. క్విడ్ ప్రోకో ప‌ద్ధ‌తిన జ‌గ‌న్ సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు పెట్టిన కార‌ణంగానే… వాన్‌పిక్‌కు నాటి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌ర్కారు వేలాది ఎక‌రాల భూముల‌ను కేటాయించిన‌ట్లు సీబీఐ కేసు న‌మోదు చేయ‌గా… సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ కేసు న‌మోదు చేసింది.

Related posts

ఏపీలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ: సీఈఓ ముఖేశ్ కుమార్ మీనా!

Drukpadam

వివేకా హత్య కేసు: అవినాశ్ రెడ్డికి సుప్రీం నోటీసులు

Drukpadam

ఇక ఆఫీసుకొచ్చేయండి: ఉద్యోగులకు విప్రో చైర్మన్ పిలుపు

Drukpadam

Leave a Comment