Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

సోషల్ మీడియాలో పరిచయమైన మహిళను ఆసుపత్రికి పిలిచిన వైద్యుడు..

సోషల్ మీడియాలో పరిచయమైన మహిళను ఆసుపత్రికి పిలిచిన వైద్యుడు.. మరో ఇద్దరు వైద్యులతో కలిసి అత్యాచారం

  • సోషల్ మీడియా ద్వారా వైద్యుడితో టీచర్‌కు పరిచయం
  • తన ఆసుపత్రిని సందర్శించాలని మహిళను కోరిన నిందితుడు
  • ఉత్తరప్రదేశ్‌లో బస్తీలో ఘటన

సోషల్ మీడియా స్నేహాలు ఎంత చేటు చేస్తాయో చెప్పేందుకు ఇదో ఉదాహరణ. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన మహిళను తన ఆసుపత్రికి రమ్మని ఆహ్వానించిన వైద్యుడు.. మరో ఇద్దరు వైద్యులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొత్వాలి ప్రాంతంలోని బస్తీ సదర్ ఆసుపత్రి వైద్యుడికి సోషల్ మీడియా ద్వారా ఓ ప్రైవేటు విద్యాసంస్థలో టీచర్‌గా పనిచేస్తున్న మహిళతో పరిచయమైంది. ఆ తర్వాత స్నేహం పెద్దదైంది.

ఈ క్రమంలో ఒకసారి తన ఆసుపత్రిని సందర్శించాలని బాధిత మహిళను వైద్యుడు కోరారు. సరేనన్న ఆమె అతడిని కలిసేందుకు ఆసుపత్రికి వెళ్లింది. ఆమెను తన హాస్టల్ గదిలోకి తీసుకెళ్లిన వైద్యుడు.. అక్కడ తన సహచరులైన వైద్యులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి తప్పించుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 27న ఈ ఘటన జరగ్గా కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా నిందితుడిని అరెస్ట్ చేశారు.

Related posts

హైద‌రాబాద్ గ్యాంగ్ రేప్ లో హోమ్ మంత్రి మనవడు లేడు …సీపీ ఆనంద్

Drukpadam

అన్నా యూనివర్సిటీ క్యాంపస్ లో దారుణం …

Ram Narayana

హైద్రాబాద్ లో అంబులెన్స్ చోరీ …

Ram Narayana

Leave a Comment