Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆసుపత్రి నుంచి ఫామ్ కు సీఎం కేసీఆర్

ఆసుపత్రి నుంచి ఫామ్ కు  సీఎం కేసీఆర్

-వైద్య పరీక్షల కోసం యశోదా ఆసుపత్రికి వచ్చిన కేసీఆర్
-అందరికీ 3 అడుగుల దూరాన్ని కొనసాగించిన సీఎం
-కేసీఆర్ వాహనంలో డ్రైవర్, ఒక గన్ మెన్ మాత్రమే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు యశోదా ఆసుత్రిలో డాక్టర్లు వైద్య పరీక్షలను నిర్వహించారు. వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే ఆయన తన ఫామ్ హౌస్ కు వెళ్లారు  కాన్వాయ్ లో కేసీఆర్ ప్రయాణిస్తున్న వాహనంలో కేవలం డ్రైవర్, ఒక గన్ మెన్ మాత్రమే ఉన్నారు. మరోవైపు కేసీఆర్ కు ఆసుపత్రిలో ఆరు రకాల పరీక్షలను నిర్వహించారు. సీఆర్పీ, సీబీపీ, సీటీ స్కాన్, చెస్ట్ ఎక్స్ రే, ఐఎల్-6, లివర్ ఫంక్షన్ టెస్టులను నిర్వహించారు.ఫామ్ హౌస్ నుంచి నేరుగా యశోదకు వచ్చిన కేసీఆర్ సాధారణంగానే నడుచుకుంటూ హాస్పటల్ లోపలి వెళ్లిపోయారు. అనంతరం అక్కడ ఆయనకు పరీక్షలు నిర్వహించారు .

ఆసుపత్రిలో కేసీఆర్ అందరికీ మూడు అడుగుల దూరాన్ని కొనసాగించారు. వైద్య పరీక్షలను నిర్వహించిన వెంటనే ఆయన ఆసుపత్రి నుంచి బయల్దేరారు. అయితే, ఆసుపత్రికి వచ్చిన కేసీఆర్… ఎప్పటి మాదిరే చలాకీగా కనిపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారనే నిర్ధారణకు వచ్చారు. మరోవైపు, కేసీఆర్ కు నిర్వహించిన టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉంది. కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.

Related posts

అజయ్ తండాలో కందాల ప్రసంగం

Ram Narayana

చిత్తూరు జిల్లాలో కొత్త ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్న అమరరాజా గ్రూపు!

Drukpadam

తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందించిన చెన్నై భక్తుడు!

Ram Narayana

Leave a Comment