3 పెళ్లిళ్లు చేసుకుని నీతులు, సూక్తులు చెబుతారా?: పవన్ పై పేర్ని నాని విమర్శలు
- విశాఖలో తన 3 పెళ్లిళ్లను ప్రస్తావించిన పవన్
- పవన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పేర్ని
- పవన్ డ్రామాలు చేస్తున్నారంటూ విసుర్లు
పవన్ కళ్యాణ్ డ్రామాలు సినిమాలో చేసుకుంటే మంచిదని ప్రజల వద్ద డ్రామాలు ఆడితే కుదరదని వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు . ప్రజలను రెచ్చగొట్టేందుకు విశాఖ వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ డ్రామాలు అదే ప్రయత్నం చేశారని అన్నారు . విశాఖ గర్జన జరిగిన రోజునే ఆయన విశాఖకువెళ్ళడంలోనే వక్రబుద్ధి కనపడుతుందని అన్నారు. ప్రక్షన్ రాజకీయాలు చేస్తున్నారని నాని మండిపడ్డారు .
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సోమవారం విమర్శలు గుప్పించారు. 3 పెళ్లిళ్లు చేసుకుని నీతులు, సూక్తులు చెబుతారా? అంటూ ఆయన పవన్ పై విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ రాజకీయాలు చేస్తున్నారా?…లేదంటే ఫ్యాక్షన్ ముఠాలు నడుపుతున్నారా? అని నాని ప్రశ్నించారు. నేర చరిత్ర కలిగిన వారు బయటకు వస్తే గానీ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించరా? అని కూడా ఆయన పవన్ ను నిలదీశారు. పవన్ కల్యాణ్ డ్రామాలు చేస్తున్నారని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన నిమిత్తం శనివారం విశాఖ చేరుకున్న పవన్… ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాను 3 పెళ్లిళ్లు చేసుకున్నానని అసూయపడుతున్నట్లున్నారు… విడాకులిచ్చి మీరూ చేసుకోండి అంటూ పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా పవన్ వ్యాఖ్యలను ప్రస్తావించిన పేర్ని… ఆ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.