చెన్నై నగరంలో జరగనున్న ఐజేయూ జాతీయ సమావేశాలు వివిధ రాష్ట్రాల నుండి ప్రజా ప్రతినిధులు చెన్నై నగరానికి కున్నారు . కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాలతో సంబంధాలు కలిగి సంఘ నిర్మాణాంతో దుసుకు పోతున్న ఏకైక జర్నలిస్టు సంఘంగా ఐజేయూ నిలిచింది .150 మంది నేషనల్ కాన్సిల్ కు ఎన్నికైన సభ్యులతో పాటు ప్రత్యక ఆహ్వానితులు వివిద రాష్ట్రాల అధ్యక్ష కార్యదర్ములు ఈ సమావేశాలలో పాల్గొంటారు. సమావేశాలకు నూతన అధ్యక్షులుగా ఎన్నికైన కె.శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహిస్తారు.
సమావేశాల్లో దేశంలో జర్నలిస్ట్ లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి కార్యాచరణ రూపొందించనున్నారు. జర్నలిస్ట్ ల ఉద్యోగ భద్రత , వేతన సంఘం ఎర్పాటు, జర్నలిస్ట్ లపై జరుగుతున్న దాడులు, మీడియా కమీషన్ ఎర్పాటు, ప్రెస్ కౌన్సిల్ లో జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం , రైల్వేపాసుల పునరుద్దరణ తదితర ప్రధాన సమస్యలపై తీర్మానం చేయనున్నారు.
చెన్నై డిక్లరేషనే దిశగా అడుగులు
చెన్నై నగరంలో జరుగుతున్న మహాసభల్లో చెన్నై డిక్లరేషన్ దిశగా ఐజేయూ అడుగులు వేస్తుంది. దేశంలో జర్నలిస్టుల పై జరుగుతున్న దాడులు. వేతన సంఘ ఏర్పాటు, మీడియా స్వేచ్ఛ ,ఉద్యోగ భద్రత లాంటి సమస్యలతో పాటు మీడియా కమిషన్ ఏర్పాటు ప్రెస్ కౌన్సిల్ లో జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం పై సమావేశం సీరియస్ గా చర్చించే అవకాశాలు ఉన్నాయి.