Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పోలింగ్​ రోజూ మునుగోడులో కేఏ పాల్​ హంగామా!

పోలింగ్​ రోజూ మునుగోడులో కేఏ పాల్​ హంగామా!
-ఉదయం నుంచి ప్రతి పోలింగ్ స్టేషన్ కు వెళ్తున్న పాల్
-ఓ పోలింగ్ బూత్ ను చూసొచ్చి బయటకు పరుగెత్తుకొచ్చిన వైనం
-ఎన్నికల్లో పాల్ కు ఉంగరం గుర్తు కేటాయింపు
-రెండు చేతులకు ఉంగరాలు పెట్టుకున్న కేఏ పాల్

మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతుంటే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మాత్రం తన హావభావాలతో అందరినీ నవ్విస్తున్నారు. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాల్ తనదైన శైలిలో ప్రచారం చేశారు. ఎన్నికల్లో తాను ఘన విజయం సాధిస్తానని చెబుతూ వస్తున్నారు. పోలింగ్ రోజు కూడా ఆయన హంగామా చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి ఆయన ఒక్కరే ప్రతి పోలింగ్ స్టేషన్ ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ పోలింగ్ స్టేషన్ ను పరిశీలించిన వెంటనే ఆయన పరుగెత్తుకుంటూ బయటకు వెళ్లిపోవడం కనిపించింది.

ఈ ఎన్నికల్లో పాల్ కు ఎన్నికల సంఘం ఉంగరం గుర్తు కేటాయించింది. పాల్ తన చేతి వేళ్లకు ఉంగరాలు పెట్టుకొని పోలింగ్ బూత్ లను పరిశీలిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఓ మీడియా ప్రతినిధి పాల్ ను ప్రశ్నించారు. ‘మీది ఉంగరం గుర్తు. చేతికి ఇన్ని ఉంగరాలు ధరించి పోలింగ్ బూత్ లోకి వచ్చారు. ఇది ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టే కదా?’ అని ప్రశ్నించారు. దీనికి పాల్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ‘టీఆర్ ఎస్ వాళ్లది కారు గుర్తు. ఆ పార్టీ నాయకులు బయట ముప్పై వేల మంది ముప్పై వేల కార్లలో తిరుగుతున్నారు? వాళ్లు కార్లలో రాకుండా సైకిల్ మీద వస్తారా?’ అంటూ పాల్ ఎదురు ప్రశ్నించారు. ఉదయం నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు . టీఆర్ యస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి , కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి లకు నియోజకవర్గంలో ఓట్లు ఉండటం తో వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు . బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్ని మండలంలో పర్యటిస్తున్నారు.

Related posts

What Operational Excellence Really Means for Business Travel

Drukpadam

ఆంధ్రప్రదేశ్‌లో ప్ర‌భుత్వ‌ కొత్త‌ ప్రధాన కార్యదర్శి గా సమీర్‌శర్మ!

Drukpadam

అమితాబ్‌ను ముస‌లోడా అన్న నెటిజ‌న్‌… సుతిమెత్త‌గానే బుద్ధి చెప్పిన బిగ్ బీ!

Drukpadam

Leave a Comment