Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాక పుట్టిస్తున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు…

కాక పుట్టిస్తున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు…
-కోవిడ్ ను సైతం లెక్క చేయని అభ్యర్థులు
-అభ్యర్థులకు మద్దతుగా రాజకీయ నాయకుల విస్తృత ప్రచారం
-ఎక్కువ డివిజన్లు పొందాలని టీఆర్ యస్ వ్యూహం
-సత్తా చాటాలని కాంగ్రెస్, సిపిఎం ప్రతి వ్యూహం
-బోణి కొట్టాలనే తపనలో బీజేపీ ఎత్తులు

తెలంగాణాలో జరుగుతున్నా ఉపఎన్నికలు కాకపుట్టిస్తున్నాయి… ప్రత్యేకించి ఖమ్మం లో జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. కోవిడ్ ను సైతం లెక్క చేయకుండా అభ్యర్థులు ఉదృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలకు కరోనా విధించిన కర్ఫ్యూ కొంత అడ్డం వచ్చింది .ప్రచార సమయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం తగ్గించింది.ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఉండటంతో ఆ సమయాన్నే అభ్యర్థులు ఉపయోగించుకుంటూ ప్రచారాన్ని సాగిస్తున్నారు.నిన్న మొన్నటి వరకు మంత్రి అజయ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ , జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం , మాత్రమే ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా చివరిలో ఎంపీ నామ నాగేశ్వరరావు , మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు , కొత్తగూడెం , సత్తుపల్లి , పాలేరు ఎమ్మెల్యేలు వనం వెంకటేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య , కందాల ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొంటున్నారు. సిపిఐ తరుపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు ,జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ లు ప్రచారంలో పాల్గొంటున్నారు. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలలో రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ తరుపున సీఎల్పీ నేత భట్టి విక్రమార్క టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ , డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ , మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు ,సిపిఎం తరుపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ .సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు , బీజేపీ కూడా మొదటి సరిగా ఖమ్మం మున్సిపాలిటీలో బోణి కొట్టాలనే పట్టుదలతో ఉంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , చింతల రామచంద్ర రెడ్డి ,పొంగులేటి సుధాకర్ రెడ్డి , రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి , బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ , పాల్గొన్నారు. సంజయ్ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు ఒకసారి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తో కలిసి పాల్గొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ కేంద్ర మంత్రి పురందరేశ్వరి , కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రకటించారు.కొందరు ఇండిపెండెంట్ లు కూడా రంగంలో ఉన్నారు. ప్రధానంగా టీఆర్ యస్ గత ఏడు సంవత్సరాల కేసీఆర్ పాలనలో ప్రత్యేకించి అజయ్ మంత్రి అయినా తరువాత జరిగిన అభివృద్ధిని గురించి ప్రచారం చేస్తుంది. ఐ టి హబ్ కొత్త బస్ స్టేషన్ , సెంట్రల్ లైటింగ్ , రోడ్ల ఆధునీకరణ , డివైడర్ల ఏర్పాటు,లకారం లేక్ , వాకర్ పారడైజ్ , పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు , గొల్లపాడు ఛానల్ ఆధునికి కరణ , తదితర అంశాలను ప్రస్తహిస్తుండగా కాంగ్రెస్ సిపిఎం ,బీజేపీ లు పైపై రంగులు వేసి అభివృద్ధి అని ప్రచారం చేసుకోవడం టీఆర్ యస్ చెల్లిందని విమర్శలు గుప్పిస్తున్నారు. 7 సంవత్సరాల క్రితం 6 వేలమందికి కాంగ్రెస్ పేదలకు పట్టాలు ఇస్తే ఇంకా వారికీ స్థలాలను చూపించలేదని కాంగ్రెస్ టీఆర్ యస్ పై ధ్వజం ఎత్తుతుంది. ప్రజల మౌలిక సదుపాయాలు ,జీవన ప్రమాణాలు పెరగాలి కాని పైపై రంగులు అద్ది అభివృద్ధి అనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్న కనీసం ప్రధాని ఫోటో కూడా లేకుండా టీఆర్ యస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండి పడ్డారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు కాని మంత్రి అజయ్ తన ఆక్రమించిన మమతా కాలేజీ భూములను రెగ్యూలరైజ్ చేయించుకున్నారని ,అవినీతి , పక్షపాతం , నిధుల దుర్వినియోగం ,పోలీసుల ను చేతులో పెట్టుకొని తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కేసులు నమోదు చేయడం ఇక్కడ మంత్రికి పరిపాటిగా మారిందని విమర్శించారు. ప్రచారానికి మరొక్క రోజే ఉండటంతో విమర్శలు ప్రతి విమర్శలు సవాళ్లు ప్రతి సవాళ్ల తో వాతావరణం వేడెక్కింది .

Related posts

తనపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ తో విచారణకు సిద్ధం:ఈటల…

Drukpadam

బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న.. కేసీఆర్ ను అమరవీరుల స్తూపానికి కట్టేస్తానని వ్యాఖ్య!

Drukpadam

విశాఖ ఎంపీ పై పవన్ కళ్యాణ్ చిందులు …

Ram Narayana

Leave a Comment