Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మునుగోడులో టీఆర్ యస్ కు ముచ్చమటలు…

3 వేల మెజారిటీ దాటేసిన టీఆర్ఎస్…8వ రౌండ్ లో 536 ఓట్ల ఆధిక్యం 

  • 8 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయిన వైనం
  • టీఆర్ఎస్ కు పోలైన ఓట్లు 52,334
  • బీజేపీ ఖాతాలో పడిన ఓట్లు 49,243
  • టీఆర్ఎస్ ఆధిక్యం 3,091 ఓట్లు

మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. అయినప్పటికి ముచ్చమటలు పడుతున్నాయి. సునాయాసంగా గెలుస్తామనుకున్న సీటు గెలుపు పై ఆందోళన కలగజేస్తుంది. నేటి ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా…మధ్యాహ్నం 2 గంటల సమయానికంతా 8 రౌండ్ల ఓట్ల లెక్కింపు మాత్రం పూర్తి అయ్యింది. ఇంకా 7 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ లో ఆధిక్యత కనబరచిన టీఆర్ఎస్… ఆ తర్వాత 2, 3 రౌండ్లలో వెనుకబడిపోయింది. అయితే తిరిగి 4 వ రౌండ్ లోనే ఆధిక్యంలోకి దూసుకువచ్చిన టీఆర్ఎస్ వరుసబెట్టి ప్రతి రౌండ్ లోనూ మెజారిటీ సాధిస్తూ సాగుతోంది.

8వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి టీఆర్ఎస్ కు 52,334 ఓట్లు వచ్చాయి. అదే సమయంలో తన సమీప ప్రత్యర్థి బీజేపీకి 49,243 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ కు 13,689 ఓట్లు వచ్చాయి. వెరసి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 3,091 ఓట్ల మెజారిటీ లభించినట్టైంది. ఒక్క 8వ రౌండ్ లోనే టీఆర్ఎస్ కు 536 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇదే ట్రెండ్ కొనసాగితే… మరో 2,3 రౌండ్లు పూర్తి అయ్యేసరికే టీఆర్ఎస్ విజయం ఖాయమైనట్టేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

Related posts

న్యూయార్క్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 9 మంది చిన్నారులు సహా 19 మంది సజీవ దహనం!

Drukpadam

అమెరికాలో ఎంట్రీ ఇచ్చిన మేడిన్ ఇండియా బండి…!

Drukpadam

మనీలాండరింగ్ కేసులో డెక్కన్ క్రానికల్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి అరెస్ట్!

Drukpadam

Leave a Comment