Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నాకు మా అన్నతో గొడవలేమీ లేవు…వైఎస్ షర్మిల!

నాకు మా అన్నతో గొడవలేమీ లేవు…వైఎస్ షర్మిల!
-అందుకే తెలంగాణలో పార్టీ పెట్టా
-తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల
-జగన్ తో గొడవలుంటే ఏపీలోనే పార్టీ పెట్టుకోవాలని గతంలో కేటీఆర్ వ్యాఖ్యలు
-కేటీఆర్ వ్యాఖ్యల్లో నిజం లేదని తేల్చేసిన షర్మిల
-అత్త మీద కోపాన్ని తాను దుత్త మీద చూపడం లేదని వ్యాఖ్య
-తాము మధ్య ఎలాంటి ఆస్తి తగాదాలు లేవని స్పష్టికరణ

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆయన సోదరి వైఎస్ షర్మిలకు గొడవలున్నాయని…ఆస్తితగాదాలు ఉన్నాయని ఇద్దరి మధ్య మాటలు కూడా లేవని పుకార్లు షికార్లు చేశాయి. అన్నతో గొడవలు ఉంటె ఏపీలోనే పార్టీ పెట్టుకోవాలన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై తాజాగా వైఎస్ షర్మిల స్పందించారు. సోమవారం నాటి పాదయాత్రలో భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన షర్మిల… తనకు తన సోదరుడితో ఎలాంటి గొడవలు లేవని తెలిపారు. తన సోదరుడితో తనకు గొడవలు ఉన్నాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని ఆమె తేల్చిచెప్పారు.తనకు తన అన్నకు మధ్య గొడవలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని షర్మిల తేల్చి చెప్పారు .ఎవరో ఎదో అనుకుంటే ప్రతిదానికి సమాధానం ఇవ్వలేమని కూడా అన్నారు . కొందరికి తనకు తనకు మధ్య గొడవలు ఉండాలని కోరుకుంటున్నారని వారి దుష్ట ఆలోచలనాలు సఫలం కావని అన్నారు . తాము వైయస్ ఆర్ బిడ్డలమని గుర్తుచుకోవాలని అన్నారు .

ఈ సందర్భంగా తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను షర్మిల ప్రస్తావించారు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు… సోదరుడితో గొడవలు ఉంటే ఏపీలో పార్టీ పెట్టుకోవాలని, అందుకు విరుద్ధంగా తెలంగాణలో పార్టీ ఎలా పెట్టుకుంటారని కేటీఆర్ అన్నట్లు షర్మిల చెప్పారు. కేటీఆర్ చెప్పిన సామెత నిజమేనని… అత్త మీద కోపాన్ని తాను దుత్త మీద చూపడం లేదన్నారు. తన సోదరుడితో తనకేమీ గొడవలు లేవన్నారు. అందుకే తాను ఏపీలో కాకుండా తెలంగాణలో పార్టీ పెట్టుకున్నానని ఆమె తెలిపారు.

Related posts

రేపు ప్రధానితో కశ్మీర్‌ నేతల భేటీ: లోయలో భద్రత కట్టుదిట్టం…

Drukpadam

మేఘాలయలో కాంగ్రెస్‌కు కోలుకోలేని షాక్.. టీఎంసీలోకి 12 మంది ఎమ్మెల్యేలు జంప్!

Drukpadam

కశ్మీర్ పై ఏకపక్ష చర్యలను ఆమోదించం: చైనా

Drukpadam

Leave a Comment