Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

దేశంలో మొదలైన పెళ్లిళ్ల సీజన్..32 లక్షల వివాహాలు లక్షల కోట్ల వ్యాపారం!

  • ఈ నెల 4 నుంచి వచ్చే నెల 14 వరకు 32 లక్షల వివాహాలు
  • మొత్తంగా రూ. 3.75 లక్షల కోట్ల వ్యాపారం 
  • ఒక్క ఢిల్లీలోనే 3.5 లక్షల వివాహాలు జరుగుతాయన్న సీఏఐటీ
  • ఈ సీజన్ లో 32 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా
    75 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం

దేశంలో ఈ నెల 4న మొదలైన పెళ్లిళ్ల సీజన్ వచ్చే నెల 14 వరకు కొనసాగుతుందని, ఈ సీజన్‌లో మొత్తంగా 32 లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) తెలిపింది. ఈ సందర్భంగా రూ. 3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఆ సంస్థ రీసెర్చ్ విభాగం నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ విషయాలను వెల్లడించింది. 

దేశవ్యాప్తంగా 35 నగరాల్లోని 4,302 మంది వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్ల నుంచి ఈ వివరాలను సేకరించింది. ఈ సీజన్‌లో ఒక్క ఢిల్లీలోనే 3.5 లక్షల వివాహాలు జరగనున్నట్టు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. ఈ వివాహాల ద్వారా రూ. 75 వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. 

ఇక గతేడాది ఇదే సీజన్‌లో దేశంలో 25 లక్షల వివాహాలు జరిగాయని, వాటి ద్వారా రూ. 3 లక్షల కోట్ల మేర వ్యాపారం జరిగిందని వివరించారు. ఈ సీజన్‌లో మార్కెట్‌లో మొత్తంగా 3.75 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే అవకాశం ఉందన్నారు. ఈ సీజన్ ముగిశాక, జనవరి 14 నుంచి జులై వరకు మళ్లీ పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుందని ఖండేల్వాల్ పేర్కొన్నారు.

Related posts

కర్నూలు ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ పేరు… సీఎం జగన్ ప్రకటనతో హృదయం ఉప్పొంగిందన్న చిరంజీవి

Drukpadam

బహుముఖ ప్రజ్ఞాశాలి ,ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ చేకూరి కాశయ్య ఇకలేరు….

Drukpadam

అమెరికా నేచురలైజేషన్ పరీక్షలో మార్పులు…పౌరసత్వం మరింత కఠినతరం.

Drukpadam

Leave a Comment