Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

6 కోట్ల అస్ట్రాజెనికా టీకా డోస్ లను అందించనున్నాం : వైట్ హౌస్

6 కోట్ల అస్ట్రాజెనికా టీకా డోస్ లను అందించనున్నాం : వైట్ హౌస్
అందుబాటులోకి రాగానే పంపిణీ మొదలు
ముందుగా ఫెడరల్ సేఫ్టీ రివ్యూ జరుగుతుంది
వెల్లడించిన వైట్ హౌస్ సలహాదారు ఆండీ సాల్విట్
ఆస్ట్రాజెనికా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను ప్రపంచ దేశాలకు అందించనున్నామని యూఎస్ వైట్ హౌస్ సీనియర్ కొవిడ్-19 సలహాదారు ఆండీ సాల్విట్ వెల్లడించారు. మొత్తం 60 మిలియన్ (6 కోట్లు) డోస్ లను ఎగుమతి చేస్తామని ఆయన అన్నారు. టీకాలు అందుబాటులోకి రాగానే పంపిణీ మొదలవుతుందని ఆయన స్పష్టం చేశారు.ఇప్పటికే ఆస్ట్రా జనికా 10 మిలియన్ డోసులు సిద్ధంగా ఉందని మరో 50 మిలియన్ల డోసులు వస్తాయని తెలిపారు దీంతో మొత్తం 60 మిలియన్ల అంటే 6 కోట్ల డోసులు సిద్ధంగా ఉంటాయని వైట్ హౌస్ తెలిపింది . వీటిని అవసరమైన దేశాలకు సరఫరా చేస్తామని తెలిపారు.

కాగా, ఫెడరల్ సేఫ్టీ రివ్యూ తరువాత ఈ ఎగుమతులు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. గడచిన మార్చిలో అమెరికా నుంచి 40 లక్షల టీకా డోస్ లు కెనడా, మెక్సికో దేశాలకు అందాయన్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవలి కాలంలో ఇండియా సహా పలు దేశాల్లో కేసుల సంఖ్య పెరిగిపోతున్న వేళ, బైడెన్ సర్కారుపై వ్యాక్సిన్ సరఫరా చేయాలంటూ ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే శ్వేతసౌధం నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.
మోడీ బైడాన్ కు ఫోన్ కాల్ చేసిన తరువాత అమెరికా ప్రవర్తనలో కొంత తేడా వచ్చింది. అంతకుముందు ఎలాంటి సహాయం చేయనని చెప్పిన అగ్ర రాజ్యం ఇప్పుడు వ్యాక్సిన్ తయారు చేసే ముడి సరుకును ఇచ్చేందుకు సిద్దపడింది ఆమేరకు ఆక్సిజన్ తో సహా ఇతర పరికరాలతో ఫ్లయిట్ ఇండియా కు వెళ్ళింది.
అయితే ప్రపంచంలో వ్యాక్సిన్ కొరతతో పాటు కరోనా విజృభిస్తున్న వేళ అమెరికా వైఖరిపై విమర్శలు ఎల్లువెత్తుతున్నాయి.

Related posts

కెనడా వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ….విమానాలపై నిషేధం తొలగింపు !

Drukpadam

బంగారంతో కరోనా మాస్కు… ధర మామూలుగా లేదు మరి!

Drukpadam

సంక్షోభంలో చిక్కుకున్న భారత్‌కు సాయం చేద్దాం రండి: పిలుపునిచ్చిన ‘లాన్సెట్’…

Drukpadam

Leave a Comment