Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క దీక్షకు షర్మిల మద్దతు

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క దీక్షకు షర్మిల మద్దతు
ప్రశ్నించడమే నచ్చని కేసీఆర్ కు ఒక మహిళ పోరాటం చేస్తే నచ్చుతుందా వైఎస్ షర్మిల
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటేటూ సీతక్క దీక్ష
భగ్నం చేసిన పోలీసులు
ఖండిస్తున్నాంటూ షర్మిల వ్యాఖ్యలు
సీతక్కకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు వెల్లడి
మహిళా ఉద్యమాలే కేసీఆర్ కు బుద్ధి చెబుతాయన్న షర్మిల

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క చేస్తున్న దీక్షకు వైయస్ షర్మిల మద్దతు ప్రకటించారు. సీతక్క కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని కోరుతూ దీక్ష చేస్తుంటే ఆమె దీక్ష ను భగ్నం చేయడం దారుణమన్నారు. కేసీఆర్ కు తాను చేసింది తప్ప ఇతరుల మాట వినే తత్వం లేదని విమర్శించారు. అందులో ఒక మహిళా పోరాటం ఆయనకు నచ్చుతుందా అని అన్నారు.ఆయనకు నచ్చిన నచ్చకపోయినా ప్రజల తరుపున పోరాటం చేయడం కొనసాగించాల్సిందేనని అన్నారు.
తెలంగాణలో కరోనాను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క దీక్ష చేపట్టగా, పోలీసులు భగ్నం చేశారు. దీనిపై వైఎస్ షర్మిల స్పందించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని నిరాహార దీక్ష చేస్తున్న సీతక్కకు ఎలాంటి పరిష్కారం చూపకుండానే ప్రభుత్వం, పోలీసులు కలిసి ఆమె దీక్షను భగ్నం చేశారని షర్మిల ఆరోపించారు. దీన్ని తాము ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజల ప్రాణాలపై పాలకులకు పట్టింపు లేకపోయినా, ఒక మహిళగా సీతక్క ప్రజల తరఫున నిలిచి వారి ఆరోగ్యం కోసం దీక్ష చేశారని, ఆమెను తాము అభినందించడమే కాకుండా, సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని షర్మిల వెల్లడించారు. ప్రశ్నించడమే నచ్చని పెద్దమనిషి కేసీఆర్ కు ఒక మహిళ పోరాటం చేస్తుంటే నచ్చుతుందా? అని ప్రశ్నించారు. ఆ అంశం జీర్ణించుకోలేకనే ప్రశ్నించే గొంతుకలను మట్టుబెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా వ్యతిరేకిగా పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ కు రేపు ఆ మహిళల ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యమాలే బుద్ధి చెబుతాయని షర్మిల పేర్కొన్నారు.

Related posts

పంతం నెగ్గించుకున్న కేరళ సర్కారు.. ఛాన్సలర్ పదవి నుంచి గవర్నర్ తొలగింపు!

Drukpadam

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన జడ్జికి పదోన్నతిపై సుప్రీంలో పిటిషన్!

Drukpadam

కేసీఆర్ కు మల్లి కేంద్రం పై కోపం వచ్చింది…

Drukpadam

Leave a Comment