Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూపిటిషన్…విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు

సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు
ఇటీవల కోర్టులో పిటిషన్ వేసిన రఘురామకృష్ణరాజు
పిటిషన్ రిటర్న్ చేసిన సీబీఐ కోర్టు
సవరణలతో మళ్లీ దాఖలు చేసిన ఎంపీ
తన పిటిషన్ ను స్వీకరించారని వెల్లడి
జగన్ కు నోటీసులు పంపుతారని స్పష్టీకరణ
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తన పార్టీ పెద్దలపై గట్టి పోరాటమే చేస్తున్నారు. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఆయన ఇటీవల దాఖలు చేసిన బెయిల్ ను సీబీఐ కోర్టు నేడు విచారణకు స్వీకరించింది. ఈ విషయాన్ని రఘురామకృష్ణరాజు స్వయంగా వెల్లడించారు. ఇటీవల తాను నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ పిటిషన్ ను తొలుత విచారణకు స్వీకరించలేదని, అయితే తాను కొన్ని సవరణలు చేసిన పిదప ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించడం జరిగిందని రఘురామ వివరించారు.

ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ న్యాయస్థానాలకు గౌరవం ఇవ్వాలన్న పాయింట్ ఆధారంగా న్యాయపోరాటం సాగిస్తున్నానని స్పష్టం చేశారు. తన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన క్రమంలో, సీఎం జగన్ కు, సీబీఐకి నోటీసులు జారీ చేస్తారని భావిస్తున్నానని తెలిపారు. జగన్ బెయిల్ రద్దు చేసి, విచారణను వేగవంతం చేయాలన్నది తన అభిమతం అని వెల్లడించారు. బెయిల్ పై బయటున్న జగన్ అక్రమాస్తుల కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు ఇకనైనా తన జోలికి రావడం మానుకోవాలని, వస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని రఘురామ హెచ్చరించారు.

Related posts

చిట్ ఫండ్స్ పేరుతో మోసం.. 250 ఏళ్ల జైలు శిక్ష!

Drukpadam

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పై ఐటీ పంజా… రూ.1000 కోట్ల విలువైన ఆస్తుల జప్తు!

Drukpadam

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై హత్యాయత్నం ….

Ram Narayana

Leave a Comment