విశాఖ బీచ్ లో పవన్ కల్యాణ్ షికారు… !
- విశాఖ పర్యటనకు వచ్చిన జనసేనాని
- నిన్న ప్రధాని మోదీతో భేటీ
- నేడు రుషికొండ పనులను పరిశీలించిన వైనం
- అనంతరం బీచ్ లో పర్యటన
![Pawan Kalyan goes to Visakha beach](https://i0.wp.com/img.ap7am.com/bimg/cr-20221112tn636f9c724b810.jpg?resize=320%2C213&ssl=1)
జనసేనాని పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం విశాఖ రుషికొండ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక బీచ్ కు వెళ్లారు. అక్కడ అలల్లో కాసేపు సేద దీరారు. ఆ సమయంలో చేపలవేటకు వచ్చిన ఓ మత్స్యకారుడితో మాట్లాడారు. వారి జీవనవిధానం, సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పవన్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఓ డ్రోన్ కూడా పవన్ కల్యాణ్ బీచ్ విహారాన్ని కవర్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. పవన్ అభిమానులు, జనసైనికులు ఈ ఫొటోలపై విశేషంగా స్పందిస్తున్నారు.
![](https://i0.wp.com/img.ap7am.com/froala-uploads/20221112fr636f9c1d0f186.jpg?w=1400&ssl=1)
![](https://i0.wp.com/img.ap7am.com/froala-uploads/20221112fr636f9c54949e2.jpg?w=1400&ssl=1)
![](https://i0.wp.com/img.ap7am.com/froala-uploads/20221112fr636f9c39437ca.jpg?w=1400&ssl=1)
![](https://i0.wp.com/img.ap7am.com/froala-uploads/20221112fr636f9dc6110ae.jpg?w=1400&ssl=1)
![](https://i0.wp.com/img.ap7am.com/froala-uploads/20221112fr636f9e00e6b1c.jpg?w=1400&ssl=1)