Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం టీఆర్‌ఎస్‌ లో భారీ చేరికలు … మంత్రి పువ్వాడ

ఖమ్మం టీఆర్‌ఎస్‌ లో భారీ చేరికలు … మంత్రి పువ్వాడ
-విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపు
-ఉమ్మడి జిల్లా తెరాస నేతలతో మంత్రి భేటీ
-పాల్గొన్న ఎంపీలు ఎమ్మెల్యేలు

సీఎం కేసీఆర్ మంత్రులు ,ఎంపీలు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో సమావేశం అయిన సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమావేశమైయ్యారు. ఎన్నికలకు కేవలం 10 నెలలు మాత్రమే సమయం ఉంది. ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజామధ్యనే ఉండాలి …ఎమ్మెల్యేలను గెలిపించాలిసిన భాద్యత మంత్రులదే అని సీఎం దిశా నిర్దేశం చేసిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా నేతలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది . అదే సందర్భంలో వివిధ పార్టీలనుంచి టీఆర్ యస్ లో భారీ చేరికలు ఉంటాయని చెప్పడం గమనార్హం …సిట్టింగులందరికి టికెట్స్ వస్తాయని అధినేత చెప్పినప్పటికీ ఖమ్మం లాంటి జిల్లాలో కమ్యూనిస్టులతో పొత్తు గురించి కూడా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం …

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు ముందుకు సాగాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు మంగళవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భేటీ అయ్యారు . భవిష్యత్ కార్యాచరణ పై దిశానిర్దేశం చేశారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ సంక్షేమ పాలనకు ఆకర్షితులై సీఎం కేసిఆర్ నాయకత్వాన్ని బలపరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అతి త్వరలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇతర పార్టీలు నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరికలు భారీగా ఉంటాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.

ప్రజలకు, పార్టీ శ్రేణులకు నేతలందరూ నిత్యం అందుబాటులో ఉండాలని, పార్టీ గెలుపే లక్ష్యంగా ఓటర్లను చైతన్య పరచాలని మంత్రి సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై అందుబాటులో ఉండేవిధంగా పనిచేయాలని ఈ సందర్భంగా నేతలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.

Related posts

మంగళగిరి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు లోకేశ్ తో ప్రత్యేక భేటీ!

Drukpadam

ధాన్యం కొనుగోళ్ల‌పై రాజ‌కీయ ర‌చ్చ‌…

Drukpadam

ఖబడ్దార్ కేసీఆర్.. నీ ఆటలు ఇక సాగవు: షర్మిల

Drukpadam

Leave a Comment