Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

మార్గదర్శి సహా చిట్ ఫండ్ కంపెనీల్లో ఏపీ వ్యాప్తంగా సోదాలు!

మార్గదర్శి సహా చిట్ ఫండ్ కంపెనీల్లో ఏపీ వ్యాప్తంగా సోదాలు!

  • మార్గదర్శి సహా కపిల్, శ్రీరామ్ చిట్స్ లలో సోదాలు
  • ఏపీ వ్యాప్తంగా సోదాలు చేస్తున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ
  • చిట్ ఫండ్ నిధులను ఇతర కార్యకలాపాలకు వినియోగిస్తున్నారన్న ఆరోపణలపై సోదాలు

ఏపీలో చిట్ ఫండ్ వ్యాపారం చేస్తున్న పలు సంస్థలకు చెందిన కార్యాలయాల్లో ఆ రాష్ట్ర రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. చిట్ ఫండ్ కార్యకలాపాల్లోని మార్గదర్శి చిట్ పండ్ తో పాటు కపిల్ చిట్ ఫండ్, శ్రీరామ్ చిట్ ఫండ్ సంస్థలకు చెందిన కార్యాలయాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మార్గదర్శి చిట్ ఫండ్స్ ఈనాడు గ్రూపు సంస్థలకు అధినేత రామోజీరావు కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీ అన్న విషయం తెలిసిందే.

చిట్ ఫండ్ ద్వారా నిధులను సేకరిస్తున్న ఆయా సంస్థలు… ఆ డబ్బును చిట్ ఫండ్ కు కాకుండా ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తున్న ఆరోపణలు రావడంతో ఈ సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం. అధిక వడ్డీల ఆశ చూపి చిట్ పాడుకున్న సభ్యులకు డబ్బు ఇవ్వకుండా తమ వద్దే ఫిక్స్ డ్ డిపాజిట్ చేయించుకుంటున్న సంస్థలు…  ఆ నిధులతో వడ్డీ వ్యాపారం చేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల ఆధారంగానే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు ఆయా కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.

Related posts

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు

Ram Narayana

సీలేరు నది విషాదం పడవలు బోల్తా 8 మంది వలస కూలీల గల్లంతు…

Drukpadam

70 పులులను చంపిన టైగర్ హబీబ్ అరెస్ట్…

Drukpadam

Leave a Comment