Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి స్పందించిన గవర్నర్ ,కేంద్రమంత్రి!

ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి ఘటన పట్ల స్పందించిన గవర్నర్ తమిళిసై!

  • హైదరాబాదులో ఎంపీ అర్వింద్ నివాసంపై దాడి
  • టీఆర్ఎస్ పై మండిపడుతున్న బీజేపీ
  • దాడిని ఖండించిన గవర్నర్
  • ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావులేదని వెల్లడి

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై దాడి జరగడం పట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర డీజీపీని కోరారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని స్పష్టం చేశారు. ఈ ఘటనను ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ట్విట్టర్ లో వెల్లడించింది.

కల్వకుంట్ల కవితను పార్టీ మారాలంటూ బీజేపీ నేతలు ఒత్తిడి చేశారని సీఎం కేసీఆర్ ఇటీవల వెల్లడించగా, బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే, హైదరాబాద్ లోని అర్వింద్ నివాసంపై దాడి జరిగినట్టు భావిస్తున్నారు. ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు, అర్వింద్ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఎంపీ అర్వింద్, ఆయన తల్లిని పరామర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy visits MP Aravind house

బీజేపీ యువ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై ఇవాళ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎంపీ అర్వింద్ ను, ఆయన తల్లిని పరామర్శించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు.

రాష్ట్ర రాజధానిలో రాజకీయ నేతలు, ప్రముఖులు నివసించే ప్రాంతంలోనే దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు తీవ్ర నిరాశలో ఉండడం వల్లే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఓడిపోతామన్న భయం, సీఎం పీఠం కోల్పోతామన్న భయంతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.

కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలని తాము ఎప్పుడూ భావించలేదని, కవితను బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నామని కేసీఆర్ అనడం అర్థరహితమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చి, మోదీ నాయకత్వంపై నమ్మకం ఉన్నవారిని మాత్రమే పార్టీలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. వివిధ పార్టీల్లో గెలిచిన వారిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నది కేసీఆరేనని, వారితో రాజీనామాలు కూడా చేయించలేదని అన్నారు.

Related posts

మార్పుతెచ్చే ఆయుధం జర్నలిస్టు కలమే….మంత్రి పువ్వాడ

Drukpadam

అమిత్ షాను విసిగించిన హర్యానా హోం మంత్రి!

Drukpadam

Why Consumer Reports Is Wrong About Microsoft’s Surface Products

Drukpadam

Leave a Comment