Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎవడ్రా రాయలసీమ ద్రోహి…?: కర్నూలులో చంద్రబాబు ఉగ్రరూపం!

ఎవడ్రా రాయలసీమ ద్రోహి…?: కర్నూలులో చంద్రబాబు ఉగ్రరూపం!

  • కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • కర్నూలు టీడీపీ ఆఫీసు వద్ద ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
  • వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైనం
  • రౌడీలకు రౌడీని అంటూ వ్యాఖ్యలు
  • బట్టలిప్పి కొట్టిస్తానంటూ వార్నింగ్

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా పర్యటన కొనసాగుతోంది. కర్నూలు టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ చంద్రబాబు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

రాయలసీమకు ఎవరేం చేశారో చర్చించడానికి తాను సిద్ధమని అన్నారు. ఎవడ్రా రాయలసీమ ద్రోహి… పనికిమాలిన దద్దమ్మల్లారా! అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనే రాయలసీమ ద్రోహి అని పేర్కొన్నారు. రాయలసీమను దోచుకునే శక్తి వైసీపీకి ఉందని, రాయలసీమను సస్యశ్యామలం చేసే శక్తి టీడీపీకే ఉందని చంద్రబాబు వివరించారు. రాయలసీమను తాము రతనాల సీమ చేస్తే, జగన్ రెడ్డి రాయలసీమకు ద్రోహం తలపెడుతున్నాడని చంద్రబాబు విమర్శించారు.

జగన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. “విశాఖ వెళ్లి ఉత్తరాంధ్ర వాళ్లను రెచ్చగొడతావు, రాయలసీమ వచ్చి ఇక్కడి వాళ్లను రెచ్చగొడతావు. మతాలకు, కులాలకు చిచ్చుపెట్టి చలికాచుకునే నువ్వు రాజకీయం చేస్తావా? ఇదేం పులివెందుల అనుకుంటున్నావా… తరిమి తరిమి కొట్టిస్తా. వైసీపీ గూండాలు ఒకటే గుర్తుపెట్టుకోండి… బట్టలిప్పి కొట్టిస్తా. మర్యాదకు మర్యాద… దెబ్బకు దెబ్బ. ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలైనా ఇస్తా. 23 బాంబులకే భయపడలేదు. నాపైనే దాడి చేయాలనుకుంటున్నారు… మా కార్యకర్తలకు నేను కనుసైగ చేస్తే మీరు చిత్తు చిత్తు అవుతారు” అంటూ హెచ్చరించారు.

“పోలీసులు ఎవరికి కాపలా కాస్తున్నారు… ఎందుకయ్యా ఎస్పీ ఇక్కడ? ఎస్పీ ఏంచేస్తున్నారు ఇక్కడ? కబ్జాదారులకు కాపలా కాస్తారా, రౌడీలకు అండగా ఉంటారా? నీకు ఐపీఎస్ ఇచ్చిందే దండగ! తమ్ముళ్లూ… నన్ను రెచ్చగొడుతున్నాడు… నన్ను రెచ్చగొట్టినవాడి పతనం ఖాయం! నేను ఎవరికీ భయపడను… ఒక్క ప్రజలకు తప్ప. నేను రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాని” అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.

కర్నూలులో వైసీపీ కార్యకర్తల నినాదాలు… మీ సంగతి తేలుస్తా అంటూ చంద్రబాబు ఫైర్!

Chandrababu fires om YCP cadre

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ కర్నూలు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకుని చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానులు కావాలంటూ నినాదాలతో హోరెత్తించారు. దాంతో టీడీపీ కార్యకర్తలు స్పందించి, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

అంతలో టీడీపీ ఆఫీసు వద్దకు చంద్రబాబు చేరుకోవడంతో నినాదాల జోరు పెరిగింది. వైసీపీ శ్రేణులు చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఓ దశలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో, చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు.

పేటీఎం బ్యాచ్ కు బిర్యానీ పొట్లాలు ఇచ్చి రెచ్చగొట్టి పంపారని మండిపడ్డారు. రాయలసీమలో ముఠా నేతలను అణచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ… మిమ్మల్ని అణచివేయడం ఓ లెక్కా! అని మండిపడ్డారు. ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను… మీ సంగతి తేలుస్తా అని హెచ్చరించారు.

Related posts

పార్టీ పెట్టె ఆలోచన లేదు …సాగర్ లో పోటీచేయటం లేదు

Drukpadam

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక …సొంత రాష్ట్రం నుంచే శశిథరూర్ కు వ్యతిరేకత …

Drukpadam

మమత నిర్ణయంపై మండిపడ్డ విపక్ష అభ్యర్థి మార్గరెట్ ఆల్వా!

Drukpadam

Leave a Comment