Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ముందస్తు ముచ్చట… ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చా …?

ముందస్తు ముచ్చట… ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చా …?
-ఎన్నికలపై దేశమంతా ఇదే చర్చ..బీజేపీ ముందస్తు దిశగా ఆలోచన చేస్తుందంటూ ప్రచారం
-తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ లోను ముందస్తు అంటూ ప్రచారం
-మొన్న తెలంగాణాలో బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి నోటా ఇదే మాట
-ఎన్నికలకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలంటున్న ఏపీ మంత్రి అప్పలరాజు
-పలాసలో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అప్పలరాజు
-ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఉన్నామన్న మంత్రి
-ప్రతిపక్షాలు, మీడియా వైసీపీని ఏమీ చేయలేవని వ్యాఖ్య
-అప్పలరాజు వ్యాఖ్యలను వారించిన ధర్మాన కృష్ణదాస్

2024 ఏప్రిల్ , మే లో జరగాల్సిన పార్లమెంట్ ఎన్నికలు ముందస్తుగా జరుగుతాయా …అందుకు బీజేపీ సిద్దపడుతుందా ? అంటే అవుననే చర్చ మొదలైంది… రాజకీయపార్టీలు సైతం అందుకు అనుగుణంగానే పావులు కదుపుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే దేశమంతా ఎన్నికల మూడ్ వచ్చేసింది .

గుజరాత్ ఎన్నికల అనంతరం హిమాచల్ , గుజరాత్ కౌంటిగ్ జరుగుతుంది. రెండు చోట్ల తాము గెలుస్తామని బీజేపీతో ధీమాతో ఉంది. వచ్చే సంవత్సరం కర్ణాటక , తెలంగాణకు ఎన్నికలు జరగాల్సిఉంది. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీకి దేశవ్యాపితంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది .అదే సందర్భంలో రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది . అందువల్ల ప్రతిపక్షాలకు మరింత అవకాశం ఇస్తే అది తమకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని బీజేపీ భావిస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల దేశమంతా ముందస్తు ఎన్నికల ముచ్చట వినిపిస్తుంది. మరో 10 నెలల్లో ఎన్నికలు జరగాల్సిన తెలంగాణ ప్రభుత్వం సైతం ముందస్తు లేదంటూనే అందుకు ఆలోచన చేస్తుందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు .

బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్నగాక మొన్న ఎన్నికలు ముందుగానే వస్తాయని అన్నారు . కేసీఆర్ సైతం ఇటీవల జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో నిత్యం నియోజకవర్గాల్లో ఉండాలని ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు .మునుగోడులో పార్టీ యంత్రాంగం అంతా మోహరించి, వామపక్ష పార్టీల మద్దతు ఇచ్చినప్పటికీ కేవలం 10 వేల ఓట్ల మాత్రమే మెజారిటీ రావడంపై అంతర్మధనం జరుగుతుంది. టీఆర్ యస్ పార్టీ పై ప్రజల్లో వ్యతిరేకతకు ఇది నిదర్శనమనే అభిప్రాయాలను పరిశీలకులు సైతం వ్యక్తం చేస్తున్నారు . అందువల్ల పార్టీని కేసీఆర్ అప్రమత్తం చేశారు . ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు . అంతర్గత సర్వేలు చేయిస్తున్నారు . సిట్టింగులందరికి సీట్లు ఇస్తామని చెబుతున్నప్పటికీ సర్వేల ఆధారంగా కొన్ని నియోజకవర్గాల్లో మార్పు ఖాయమంగా కనిపిస్తుంది.

ఏపీలో అధికార వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమంటూ విపక్ష టీడీపీతో పాటు జనసేనలు చేస్తున్న వాదనలకు బలం చేకూరుస్తూ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని సొంత నియోజకవర్గ కేంద్రం పలాసలో అప్పలరాజు నూతనంగా నిర్మించిన తన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం .

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చంటూ అప్పలరాజు వ్యాఖ్యానించారు. కార్యకర్తలంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే మనం ఎన్నికల ప్రచారంలో ఉన్నామని కూడా ఆయన వైసీపీ శ్రేణులను ఉద్దేశించి కీలక వ్యాఖ్య చేశారు. వైసీపీని ప్రతిపక్షాలతో పాటు ఆ పార్టీలకు వంత పాడుతున్న మీడియా కూడా ఏమీ చేయలేవన్నారు. ఇదిలా ఉంటే…ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్.. అప్పలరాజును వారించడం విశేషం .

Related posts

ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కొమ్మినేని!

Drukpadam

‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా 24న దేశవ్యాప్త నిరసన… రైతు సంఘాలు…

Drukpadam

కర్ణాటక ఎన్నికలు …చెట్లపై డబ్బులు ….!

Drukpadam

Leave a Comment