Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్

  • ఈటలపై తీవ్రస్థాయిలో భూకబ్జా ఆరోపణలు
  • 66 ఎకరాలు కబ్జా చేసినట్టు నివేదికలో వెల్లడి
  • ఆరోగ్య శాఖను తాను చేపట్టిన సీఎం కేసీఆర్
  • బర్తరఫ్ చేయాలంటూ తాజాగా గవర్నర్ కు సిఫారసు
  • ఈటలను బర్తరఫ్ చేసిన గవర్నర్ తమిళిసై

భూ అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ ను తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. సీఎం కేసీఆర్ సిఫారసుల మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బర్తరఫ్ చేశారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామ పరిధిలో 66 ఎకరాల అసైన్డ్ భూమిని ఈటల ఆక్రమించినట్టు అధికారులు తమ నివేదికలో స్పష్టం చేయడంతో, ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

ఈటల నుంచి నిన్ననే ఆరోగ్యశాఖను తన చేతుల్లోకి తీసుకున్న సీఎం కేసీఆర్ తాజాగా ఆయనను మంత్రివర్గం నుంచి కూడా తప్పించారు. కొన్ని గంటల పాటు శాఖ లేని మంత్రిగా ఉన్న ఈటల ఇప్పుడు బర్తరఫ్ తో మాజీ అయ్యారు.

Related posts

సీబీఐ అధికారులు రావడంతో ఇంటి తలుపులు వేసుకున్న వివేకా పీఏ!

Drukpadam

Drukpadam

అతిధుల సమక్షంలో పంజాబ్ సీఎం మాన్ వివాహం !

Drukpadam

Leave a Comment