Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్‌ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు: సీఎం కేసీఆర్‌

మున్సిపల్‌ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు: సీఎం కేసీఆర్‌
  • రెండు కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో ఎన్నికలు
  • అన్నింట్లో తెరాస విజయ దుందుభి
  • తెరాసయే తమ పార్టీ అని ప్రజలు నిరూపించారన్న సీఎం
  • 74 శాతం వార్డులు తెరాస కైవసం
kcr thanks people of 7 muncipality people who went for polls

తెలంగాణలో ఇటీవల నిర్వహించిన మినీ మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ దాదాపు పూర్తయింది.  వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంస్థలతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్‌, కొత్తూరు పురపాలక సంఘాలకు గత నెల 30న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.  జీహెచ్‌ఎంసీలోని లింగోజిగూడ, మరో నాలుగు మున్సిపాలిటీల్లోని 4 వార్డులకూ పోలింగ్‌ జరిగింది. దాదాపు అన్నిచోట్లా అధికార తెరాస పార్టీ హవా కొనసాగింది.

ఈ సందర్బంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెరాస పార్టీయే తమ పార్టీ అని తెలంగాణ ప్రజలు నిష్కర్షగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారు. తాజా మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 248 స్థానాలకుగాను 181 స్థానాల్లో తెరాస, 3 స్థానాల్లో మిత్రపక్షం సీపీఐకి కలిపి మొత్తం 184 స్థానాల్లో తెరాస గెలిచిందన్నారు. తెరాసకు తిరుగులేదని మరోమారు నిరూపించారని సీఎం అన్నారు. రాష్ట్రంలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో అన్నింటినీ గెలిపించారన్నారు. 74శాతం వార్డులతో తెరాస పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టారన్నారు. అందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

Related posts

రసమయి తీరు మార్చుకో…టీయూడబ్ల్యూ జె రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ …

Drukpadam

ప్రధాని మోదీ రామగుండం వస్తే అగ్నిగుండమేనన్న విద్యార్థి జేఏసీ!

Drukpadam

ఉచిత హామీలపై సుప్రీం సీరియస్.. కేంద్రం, ఈసీకి నోటీసులు

Drukpadam

Leave a Comment