Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సంచలంగా మారిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు …

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సంచలంగా మారిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు
అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు తమ టీం సిద్ధం అనే సంకేతాలు ….
సమయంసందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తా
ప్రజాహితమే తన అభిమతమన్న పొంగులేటి
తప్పకుండా ప్రజల కోరిక నేరవేరుస్తానని హామీ
పొంగులేటి క్యాంపు కార్యాలయంలో న్యూ ఇయర్ సంబురాలు
ఉమ్మడి ఖమ్మంజిల్లా నుంచి వేలాదిగా తరలొచ్చిన నాయకులు,

రాబోవు 2023 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు శీనన్న టీం సిద్ధంగా ఉందనిఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాననిప్రజాహితమే తన అభిమతంగా భావిస్తాననితప్పకుండా వారి కోరిక నేరవేరుస్తానని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రసంగించారు. సందర్భంగా ఆయన చేసిన రాజకీయ నర్మగర్భ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

వివరాలు పొంగులేటి మాటల్లోనేనూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేసేందుకు విచ్చేసిన ప్రతి ఒక్క అక్కకుచెల్లికిఅన్నకుతమ్ముడికి శిరస్సు వంచి పేరుపేరునా అభినందనలుకృతజ్ఞతలుమీ అందరికీ 2023 నూతన సంవత్సర శు భాకాంక్షలు సంవత్సరంలో మీకునాకువేదిక మీదవేదిక ముందున్న ప్రతి ఒక్కరికీ మంచి జరగాలనిమంచి జరుగుతుందని ప్రగాఢంగా నమ్ముతూ భారాన్ని దేవుడి మీదతో పాటుగా మీ మీద కూడా ఉంచి రోజు మనమందరం ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. వేదిక మీద ఉన్న కొంతమంది నా మిత్రులుఇంకా రాని కొంతమంది నా మిత్రులతో పాటుప్రజల చేత దీవించబడే ప్రజాప్రతినిధి అర్హత ఉన్నా ప్రతి ఒక్క నా అనుచరుడురాబోవు ఎన్నికల్లో పోటీచేస్తారని వేదిక సాక్షిగా తెలియజేస్తున్నాను. గడిచిన నాలుగున్నరేళ్లలో ఏమి ఇబ్బంది జరిగిందిఎందుకు జరిగిందనేది మనకు తెలియంది కాదుఈనాడు మనం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం పార్టీలో మనకు జరిగిన గౌరవం ఏంటి…? భవిష్యత్తులో జరగబోవు గౌరవం ఏంటి…? అనేది ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక్కటైతే ఖచ్చితంగా చెబుతున్నాను వేదిక మీద ఉన్న వివిధ నియోజకవర్గాల ముఖ్య నాయకులందరూ కూడా రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీచేసి తీరుతారు. ప్రజల ప్రేమ, అభిమానాలు పొందినపొందుతూ ఉన్న ప్రతీ నాయకుడు ప్రజాప్రతినిధి కావాల్సిన ఆవశ్యకత ఉంది. అలా అయినప్పుడే ప్రజలకు మంచి జరుగుతుందిన్యాయం జరుగుతుందిప్రజాహిత పరిపాలన జరుగుతుందిఇది రాజకీయ వేదిక కాదుసమయంసందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు మీతో చర్చిస్తా…! తప్పకుండా మీ దీవెనలతోమీ ఆశీర్వాదంతోమీరు ఏదైతే కోరుకుంటున్నారోకోరుకునేది తప్పకుండా చేసి చూపిస్తామని హామీ ఇస్తున్నాను. మరొకసారి కార్యక్రమానికి హాజరైన శీనన్న కుటుంబసభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నానంటూ ప్రసంగాన్ని ముగించారు.

పొంగులేటి క్యాంపు కార్యాలయంలో 2023 సంబరాలు

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పొంగులేటి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి. ఉమ్మడి ఖమ్మంజిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శీనన్న మిత్రులతో పాటు ఆయా ప్రాంతాల స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పలు సంఘాల నేతలు, వ్యాపార, వాణిజ్య ప్రముఖులు, ఇంకా అనేక మంది వేలాదిగా తరలొచ్చారు. శీనన్నకు పుష్పగుచ్ఛాలు, శాలువాలు, బోకేలు, ప్రత్యేకమైన కానుకలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేయడంతో పాటు ఆయనపై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆయా ప్రాంతాల నుంచి లారీలు, ట్రాక్టర్లు, బస్సులు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో ర్యాలీగా తండోపతండాలుగా వేడుకకు హాజరైయ్యారు. ర్యాలీల సందర్భంగా డప్పు చప్పుళ్లు, ప్రత్యేకమైన వేషదారణలు, కోలాట నృత్యాలు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Related posts

రబ్బరు చెప్పులు వేసుకున్నాయనికి బంగ్లాలు ఎక్కడ నుంచి వచ్చాయి. మధు యాష్కీ !

Drukpadam

దళితుల వ్యతిరేకత మధ్యనే దేవినేని ఉమ కుటుంబసభ్యులను పరామర్శించిన చంద్రబాబు!

Drukpadam

కర్ణాటక సీఎల్పీ సమావేశం… సీఎం ఎంపికపై ఎమ్మెల్యేలతో సమాలోచనలు …

Drukpadam

Leave a Comment