Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలురాజకీయ వార్తలు

ఏపీ సీఎం జగన్ జార్ఖండ్ సీఎం సొరేన్ కు సుద్దులు చెప్పటంపై అభ్యతరం

ఏపీ సీఎం జగన్ జార్ఖండ్ సీఎం సొరేన్ కు సుద్దులు చెప్పటంపై అభ్యతరం
వైఎస్సార్ కొడుకువై ఉండీ వాటికి భయపడతారా?: జగన్ ట్వీట్‌పై ఒడిశా ఎంపీ రీ ట్వీట్
హేమంత్ సోరెన్ ట్వీట్‌పై జగన్ స్పందనను ఆక్షేపించిన ఒడిశా కాంగ్రెస్ ఎంపీ
మీ రాజకీయ ప్రయోజనాలకు మోదీతో లాలూచీనా?
మీరింకా ఎదగాలి జగన్ అంటూ ట్వీట్
ప్రధాని నరేంద్రమోదీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చేసిన ట్వీట్‌కు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పందించడం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంది మరో రాష్ట్ర ముఖ్యమంత్రి కి సుద్దులు చెప్పడం ఏమిటి ? ఇది నీకు తగునా అందులో వైయస్సార్ కొడుకువై ఉంది విమర్శలకు భయపడతావా ? నీవు మారాలి , ఇంకా ఎదగాలి కాంగ్రెస్ కు చెందిన ఎంపీ సప్తగిరి వ్యాఖ్యానించారు . కరోనా నియంత్రణపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మొన్న ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం హేమంత్ సోరెన్ నిన్న ట్వీట్ చేస్తూ ప్రధాని తన మాటలు వినలేదని, ఆయన చెప్పాలనుకున్నదే చెప్పారని అన్నారు. దానికి బదులుగా ప్రధాని కొన్ని పనికొచ్చే మాటలు చెప్పి, పనికొచ్చే మాటలు వింటే బాగుండేదంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

జార్ఖండ్ సీఎం ట్వీట్‌పై జగన్ స్పందిస్తూ.. మన మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా ఇలాంటి రాజకీయాలు తగవని, ఒకరినొకరం వేలెత్తి చూపించుకోవద్దని, అందుకు ఇది సమయం కాదని అన్నారు. మహమ్మారిపై జరుగుతున్న యుద్ధంలో ప్రధానికి అండగా నిలబడదామని హితవు పలికారు.

జగన్ ట్వీట్‌పై స్పందించిన ఒడిశా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలాకా రీట్వీట్ చేస్తూ.. రాజకీయ ప్రయోజనాల కోసం మోదీతో లాలూచీ పడడం సరికాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజశేఖరరెడ్డి లాంటి పెద్ద నేతకు కుమారుడివై ఉండీ ఇలా సీబీఐ, ఈడీ దాడులకు భయపడి ప్రధానికి దాసోహం కావడమేంటని ప్రశ్నించారు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అని, మీరు మరింత ఎదగాలి అంటూ విమర్శలు కురిపించారు

Related posts

కొత్త జిల్లాల ఏర్పాటు స్వాగతిస్తున్నాం… హిందూపురం ను జిల్లా కేంద్రంగా చేయాలి :బాలకృష్ణ

Drukpadam

రఘురామకృష్ణరాజు విషయంలో ఏమైనా జరగొచ్చు: సోము వీర్రాజు

Drukpadam

శరద్ పవార్‌ను కలిసి విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ.. పోరాటానికి మద్దతు ఇవ్వాలని వినతి!

Drukpadam

Leave a Comment