Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

కారులో ఊపిరాడ‌క న‌లుగురు చిన్నారుల మృతి…

కారులో ఊపిరాడ‌క న‌లుగురు చిన్నారుల మృతి…
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సింగౌలిత‌గా గ్రామంలో ఘ‌ట‌న‌
మ‌రొక చిన్నారికి ఆసుప‌త్రిలో చికిత్స
అంద‌రూ పదేళ్ల‌లోపు వ‌య‌సున్న వారే
కారులో ఊపిరాడ‌క న‌లుగురు చిన్నారులు మృత్యువాత ప‌డ్డారు. మ‌రొక చిన్నారికి ఆసుప‌త్రిలో చికిత్స అందుతోంది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సింగౌలిత‌గా గ్రామంలో చోటు చేసుకుంది. ఓ ఇంటి ముందు పార్కు చేసిన కారులో ఐదుగురు పిల్ల‌లు ఆడుకుంటున్న స‌మ‌యంలో కారు లాక్ అయిపోయింది. దీంతో వారంతా అందులోనే ఉండ‌డంతో ఊపిరాడ‌లేదు.

వారిని గుర్తించి బ‌య‌ట‌కు తీసే స‌మ‌యానికే న‌లుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌నపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఆ చిన్నారులు అంద‌రూ పదేళ్ల‌లోపు వ‌య‌సున్న వారే అని వివ‌రించారు. చిన్నారుల‌ మృత‌దేహాల‌ను పోస్టుమార్టంకు త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. వారు ఊపిరాడ‌క మృతి చెందిన‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింద‌ని చెప్పారు.

Related posts

హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణం.. యువతిని దారి మళ్లించి అత్యాచారం!

Drukpadam

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్అరెస్ట్

Ram Narayana

విజయవాడలో దారుణం… డాక్టర్ కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

Ram Narayana

Leave a Comment