Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చైనా రాకెట్ శకలాలు హిందూ మహాసముద్రంలో…

NASA slammed China after racket debris collapsed in Indian Ocean
రాకెట్ శకలాలు హిందూ మహాసముద్రంలో పడిన నేపథ్యంలో చైనాపై నాసా ఆగ్రహం

చైనా రాకెట్ శకలాలు హిందూ మహాసముద్రంలో

చైనాపై నాసా ఆగ్రహం
అదుపు తప్పిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్
తిరుగు ప్రయాణంలో అపశృతి
భూ వాతావరణంలో ప్రవేశించి దగ్ధమైన వైనం
మాల్దీవులకు సమీపంలో సముద్రంలో పడిన శకలాలు
చైనాది బాధ్యతారాహిత్యమన్న నాసా
చైనా ప్రయోగించిన ఒక రాకెట్ అదుపుతప్పింది. అది భూమి పడితే పెద్ద ప్రమాదమే జరిగేది .కాని తిరుగు ప్రయాణంలో హిందూ మహాసముద్రంలో పడింది . గత కొన్ని రోజులుగా అదుపుతప్పిన రాకెట్ ఒక్కడా భూమండలం మీద పడుతుందోననే ఆందోళన వ్యకతం అయింది.అయినప్పటికీ చైనా బాధ్యతారాహిత్యం పై వివిధ దేశాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.నాసా నేరుగా చైనా పై విరుచుకుపడింది
చైనా ప్రయోగించిన ఓ రాకెట్ తిరుగు ప్రయాణంలో నియంత్రణ కోల్పోవడంతో ఆ శకలాలు హిందూ మహాసముద్రంలో మాల్దీవులకు సమీపంలో పడిన సంగతి తెలిసిందే. అవి భూభాగంపై పడి ఉంటే తీవ్ర నష్టం జరిగి ఉండేదన్న నేపథ్యంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చైనాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్దేశిత ప్రమాణాలు పాటించడంలో చైనా విఫలమైందని నాసా విమర్శించింది.

నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ స్పందిస్తూ, తమ అంతరిక్ష శకలాలకు సంబంధించి చైనా బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిందని ఆరోపించారు. అంతరిక్ష పరిశోధనలు నిర్వహించే దేశాలు భూమండలంపై ఉండే మానవులకు, ఆస్తులకు నష్టం కలిగించే అవకాశాలను అత్యంత కనిష్టానికి తగ్గించాలని హితవు పలికారు. ఇలాంటి పరిణామాలకు సంబంధించి మరింత పారదర్శకతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.

Related posts

కులంతోపనిలేదు …ఈ లక్షణాలు ఉంటె చాలు యువతి పెళ్లి ప్రకటన!

Drukpadam

మండల కేంద్రం కాబోతున్న ఎంపీ గాయత్రీ రవి సొంత గ్రామం ఇనగుర్తి …?

Drukpadam

చంద్రబాబు 13చోట్ల సంతకాలు పెట్టారు: సీఐడీ చీఫ్ సంజయ్

Ram Narayana

Leave a Comment