Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ యస్ వ్యతిరేక ప్లాట్ ఫారం కోసం ప్రయత్నాలు :కొండా విశ్వేశ్వర్ రెడ్డి

టీఆర్ యస్ వ్యతిరేక ప్లాట్ ఫారం కోసం ప్రయత్నాలు :కొండా విశ్వేశ్వర్ రెడ్డి
-రాష్ట్రంలో యాంటీ కేసీఆర్ వేవ్ చాలా బలంగా ఉంది
-ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు గెలుపు కాదు కేవలం 31 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి
-ఈటలతో కలిసి ముందుకు … మరో ఇద్దరు మంత్రులు , ఎమ్మెల్యేలు
-మాతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
సీఎం అయ్యే అర్హత కేటీఆర్ కు లేదు:
-కేటీఆర్ మంచి వ్యక్తి… అయితే ఆయనకు తెలంగాణ రాష్ట్ర ఇష్టంలేదు
-హరీశ్, ఈటలకు ఆ అర్హతలు ఉన్నాయి
-టీఆర్ఎస్ నాయకులతో నాకు విభేదాలు లేవు
-కాంగ్రెస్ బలహీనపడింది రేవంత్ కు పదవి ఇచ్చిన కొలువుకోవటం కష్టం
-బీజేపీ నమ్మకమైన పార్టీ కాదు వారికీ కేంద్రమే ముఖ్యం
-అందుకే కేసీఆర్ అవినీతి మీద చర్యలు లేవు
కొండా విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి . ఇటీవలకాలంలో నిత్యం వార్తలలో ఉంటున్నాడు. ఈటల కేసీఆర్ మంత్రి వర్గంనుంచి భర్తరఫ్ అయినా తరువాత ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. ఏమిటని మీడియా ప్రతినిదులు ప్రశ్నించగా ఈటల భార్య జామున మాకు దగ్గర బంధువు అందువల్లనే పలకరించడానికి వచ్చానని అన్నారు. అదిజరిగి నాలుగైదు రోజుల తరువాత ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన మనసులోని మాటలను ఆవిష్కరించారు. రాష్ట్రంలో టీఆర్ యస్ వ్యతిరేకత చాలా బాగాఉందని , తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు, నియామకాలు వస్తాయని ఇక్కడ ప్రజలు భావించారని , అది నెరవేరలేదని ప్రజల్లో బలమైన అభిప్రాయం ఉందని అన్నారు . కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్న శక్తులను కూడగట్టే పనిలో ఉన్నట్లు తెలిపారు. అందులో కేసీఆర్ మంత్రి వర్గంలోని ఇద్దరు మంత్రులతో పాటు, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారని వెల్లడించారు. ఆ మంత్రుల పేర్లు చెప్పేందుకు నిరాకరించారు. సమయం వచ్చినప్పుడు అన్ని చెపుతానని అన్నారు. షర్మిల పార్టీ కేసీఆర్ సృష్టిలో భాగంగానే విషయాన్నీ తోసి పుచ్చలేమని అన్నారు. కాంగ్రెస్ కు ఇప్పటి వరకు ఉన్న క్రిస్టియన్ల ఓట్లను చీల్చటమే లక్ష్యం అనే అనుమానాలు వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇలాంటి వాటిలో దిట్ట అని తన వ్యతిరేక ఓట్లు ఎన్ని చీలిపోతే అంత మంచిదని వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ,బీజేపీ జాతీయపార్టీలు ఉన్న కాంగ్రెస్ బలహీనపడిందని , ఒకవేళ ఇప్పుడు రేవంత్ కు టీపీసీసీ ఇచ్చినా,కాంగ్రెస్  కోలుకోవడం కష్టమని అన్నారు.దేశంలోని కాంగ్రెస్ ఎక్కడలేదని అన్నారు.ఇక బీజేపీ తమకు కేంద్రంలో అధికారం ఉంటె చాలు అనే భావనలో ఉందని అందువల్ల కేసీఆర్ తో యుద్దానికి సిద్ధం అవుతుందని అనుకోవడం లేదని అన్నారు. కేసీఆర్ అవినీతి గురించి మాట్లుడుతూన్న బీజేపీ ఆయనపై ఎందుకు విచారణ జరిపించటంలేదని అన్నారు. అందువల్ల కేసీఆర్ బీజేపీ మధ్య అవగాహనా ఉండే అవకాశమే ఉందన్నారు.
టీఆర్ఎస్ నాయకులతో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని విశ్వేశ్వర్ రెడ్డి వివరించారు. కాంగ్రెస్ పార్టీలో తనకు శత్రువులు ఎవరూ లేరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలహీనపడిందని… అధికార టీఆర్ఎస్ ను ఎదుర్కోలేకపోతోందని, అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చానని అన్నారు. ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి మాణికం ఠాగూర్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు వివరించానని చెప్పారు.

కేటీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు లేవు

కేటీఆర్ స్వతహాగా మంచివాడు … అసలు ఆయనకు తెలంగాణ రాష్ట్ర రావడమే ఇష్టం లేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు లేవని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు… రాష్ట్రానికి సీఎం అయ్యే అర్హత కేవలం ఇద్దరికి మాత్రమే ఉందని… వారు హరీశ్ రావు, ఈటల రాజేందర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డికి కూడా కొంత వరకు ఆ అర్హత ఉందని అన్నారు. వ్యక్తిగతంగా చూస్తే కేటీఆర్ చాలా మంచి వ్యక్తి అని… అయితే ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు మాత్రం ఆయన సరైన వ్యక్తి కాదని చెప్పారు.

 

Related posts

షర్మిల జెండా ఎత్తి వేస్తున్నారా …? కాంగ్రెస్ కు జై కొట్టబోతున్నారా …??

Drukpadam

ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించిన కేసీఆర్…!

Drukpadam

కాంగ్రెస్ కు మరో ఎదురు దెబ్బ ..గోవా లో పార్టీని వీడిన 8 మంది ఎమ్మెల్యేలు!

Drukpadam

Leave a Comment