Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సీఎల్పీ నేత భట్టితో ఈటల భేటీ…

సీఎల్పీ నేత భట్టితో ఈటల భేటీ…
హైదరాబాదులో భట్టి నివాసానికి వెళ్లిన ఈటల
ఈటలపై భూకబ్జా ఆరోపణలు
మంత్రి పదవిని పోగొట్టుకున్న వైనం
రాజకీయ భవితవ్యంపై అనుచరులతో చర్చ
ఈ మధ్యాహ్నం భట్టితో సమావేశం
భూకబ్జా ఆరోపణలతో కేసీఆర్ మంత్రివర్గం నుంచి భర్తరఫ్ అయిన మంత్రి ఈటల రాజేందర్ తన వ్యూహానికి పదును పెడుతున్నారు. దీనిలో భాగంగానే ఆయన సీఎల్పీ నేత భట్టిని హైద్రాబాద్ లోని భట్టి నివాసానికి వెళ్లి కలిశారు.  తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన వివిధ పక్షాల నేతలను కలిసి వివరించే ప్రయత్నం చేస్తున్నారా ? లేక ? తన అడుగుల పై అభిప్రాయానికి రాలేక పోతున్నారా ? అనేదానిపై సందేహాలు వ్యక్తం అవుతున్న సందర్భంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ను కలవడం ప్రాధాన్యత సంతరించుకున్నది . అంతకు ముందు మాజీ ఎంపీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన కొండా విశ్వేశ్వర రెడ్డి ఈటల నివాసానికి వెళ్లి కలిశారు. కేసీఆర్ వ్యతిరేక ప్లాట్ ఫారం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలలో భాగంగానే ఆయన్ను కలిసి నట్లు వార్తలు వచ్చాయి. తనపై కక్ష సాధింపు చర్యలలో భాగంగానే భూకబ్జా ఆరోపణలు చేశారని అభిప్రాయాలు ఉన్నాయి. అయితే అయన కాంగ్రెస్ లేదా బీజేపీ లో చేరతారా ?లేక సొంత పార్టీ పెడతారా అనేదానిపై ఇంకా ఒకక్లారిటీ రావాల్సి ఉంది. శాశనసభలో ఈటల విషయం ప్రస్తావించేందుకే భట్టిని కలిశారా ? లేక తన రాజకీయ భవిషత్ పై ఆయనతో కలిసి సమాలోచనలు చేశారా ? అనే చర్చ జరుగుతుంది.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ భవితవ్యం ఇంకా అనిశ్చితికరంగానే ఉంది. భూకబ్జా ఆరోపణలపై మంత్రి పదవిని కోల్పోయిన ఈటల ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి కలిగిస్తోంది. గత కొన్నిరోజులుగా ఆయన హుజూరాబాద్ నియోజకవర్గంలోని తన అనుచరులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాదులో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

నేడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లిన ఈటల ఆయనతో సమావేశమయ్యారు. టీఆర్ఎస్ పార్టీలో కొనసాగే అవకాశాలు ఏమాత్రం లేకపోవడంతో, పలు పార్టీలకు చెందిన రాజకీయనేతలను కలిసి చర్చలు జరిపేందుకు ఈటల నిర్ణయించుకున్నారు. ఈ భేటీలు ముగిసిన తర్వాత తన రాజకీయ భవితవ్యంపై త్వరలోనే ఈటల నుంచి ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.

Related posts

రాజశేఖరరెడ్డి నరరూప రాక్షసుడు.. జగన్ ఊసరవెల్లి: టీఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు…

Drukpadam

రాజస్థాన్ సీఎం సంచలన వ్యాఖ్యలు..తిప్పికొట్టిన వసుంధర రాజే!

Drukpadam

ఇటువంటి సమయంలో మహారాష్ట్ర మంత్రులు కర్ణాటకకు రావడం సరికాదు: సీఎం బసవరాజ్ బొమ్మై

Drukpadam

Leave a Comment