Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

భారత్ లో సింగిల్ డోస్ కరోనా టీకాలు… రేసులో జాన్సెన్, స్పుత్నిక్ లు…

భారత్ లో సింగిల్ డోస్ కరోనా టీకాలు… రేసులో జాన్సెన్, స్పుత్నిక్ లు…
భారత్ లో ప్రస్తుతం రెండు డోసుల వ్యాక్సిన్ల పంపిణీ
సమస్యాత్మకంగా మారిన డోసుల మధ్య విరామం, కొరత
ఆశలు రేకెత్తిస్తున్న సింగిల్ డోసు వ్యాక్సిన్లు
మే నెలాఖరుకు స్పుత్నిక్ లైట్ ప్రయోగ ఫలితాలు
భాగస్వామి కోసం చూస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్
ప్రస్తుతం అమల్లో ఉన్న రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ల పంపిణీ ఓ సమస్యగా మారింది. రెండు డోసుల మధ్య విరామం, వ్యాక్సిన్ల కొరత అధికార యంత్రాంగాన్ని వేధిస్తున్నాయి. ఈ పరిస్థితులను అధిగమించేందుకు సింగిల్ డోస్ వ్యాక్సిన్లు రంగప్రవేశం చేయనున్నాయి. అన్నీ కుదిరితే…. అమెరికాకు చెందిన ‘జాన్సెన్’ (జాన్సన్ అండ్ జాన్సన్), రష్యాకు చెందిన ‘స్పుత్నిక్ లైట్’ కరోనా వ్యాక్సిన్లు భారత్ లో అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు సింగిల్ డోస్ వ్యాక్సిన్లే.

‘స్పుత్నిక్ లైట్’ చివరి దశ ప్రయోగ ఫలితాలు త్వరలోనే వెల్లడి కానుండగా, జులైలో ఇది భారత్ లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. రష్యాకు చెందిన ‘స్పుత్నిక్ వి’ వ్యాక్సిన్ ను భారత్ లో పంపిణి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్… ‘స్పుత్నిక్ లైట్’ సింగిల్ డోస్ వ్యాక్సిన్ కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది.

అటు, జాన్సన్ అండ్ జాన్సన్ తన ‘జాన్సెన్’ సింగిల్ డోస్ వ్యాక్సిన్ కోసం భారత్ లో తగిన భాగస్వామి కోసం అన్వేషిస్తోంది. భారత్ లోనే ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు తగిన వనరులున్న భాగస్వామి కోసం ఈ అమెరికా సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ రెండు కంపెనీ లు ప్రయతనాలు సెక్సెస్ అయితే భారత్ ను పట్టి పీడిస్తున్న వ్యాక్సిన్ల కొరత తీరుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Related posts

దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ భయాలు ….

Drukpadam

కృష్ణపట్నంలో ఇద్దరికి పాజిటివ్.. మరో 27 మందిలో స్వల్ప లక్షణాలు….

Drukpadam

కరోనా వ్యాక్సిన్ తీసుకోకుంటే తెలంగాణాలో నో రేషన్ , నో పెన్షన్ “సర్కార్ నిర్ణయం!

Drukpadam

Leave a Comment