Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

మమతా బెనర్జీ ఇంట విషాదం…

మమతా బెనర్జీ ఇంట విషాదం…
కరోనాతో కన్నుమూసిన మమత సోదరుడు
పన్నీర్ సెల్వం ఇంట కూడా విషాదం
సంతాపం తెలిపిన స్టాలిన్
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తమ్ముడు అషిమ్ బెనర్జీ 60 కరోనా కారణంగా మృతి చెందారు. బెంగాల్ లో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఒక్కరోజే బెంగాల్ లో 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 136 మంది మృతి చెందారు. మొత్తం పాజిటివ్ కేసులు 10 లక్షల 94 వేల 802 నమోదు కాగా ,ప్రస్తుతం లక్ష 31 వేల 792 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.12 వేల 993 మంది చనిపోయారు . బెంగాల్ లో కూడా ఈ అర్థరాత్రి నుంచి ఈ నెల చివరి వరకు సంపూర్ణ లాక్ డౌన్ ప్రభుత్వం ప్రకటించింది.

ఇదే సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇంట కూడా విషాదం నెలకొంది. పన్నీర్ సెల్వం సోదరుడు బాలమురుగన్ మృతి చెందారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. బాలమురుగన్ మృతి పట్ల ముఖ్యమంత్రి స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశారు. పన్నీర్ సెల్వంకు స్వయంగా ఫోన్ చేసి ఓదార్చారు.

Related posts

కేసులు పెరిగినా భయపడాల్సిన పనిలేదు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Drukpadam

కరోనా బారిన 50 మంది భారత్ బయోటెక్ ఉద్యోగులు…

Drukpadam

తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రారంభం.. నిర్మానుష్య‌మైన రోడ్లు

Drukpadam

Leave a Comment