Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలురాజకీయ వార్తలు

కేసీఆర్ కు అధికారంలో కొనసాగే హక్కులేదు : ఎంపీ కోమటిరెడ్డి…

కేసీఆర్ కు అధికారంలో కొనసాగే హక్కులేదు : ఎంపీ కోమటిరెడ్డి..
మానవత్వంలేని కేసీఆర్ కు ప్రజల ఉసురు తప్పక తగులుతుంది: కోమటిరెడ్డి ఫైర్
కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చరన్న కోమటిరెడ్డి
అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిన మాట ఏమైందని ఆగ్రహం
కేటీఆర్ ను ట్విట్టర్ లో నిలదీస్తున్నారని వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా తో ప్రజలు ప్రాణాలు పోగుట్టుకుంటు రాష్ట్రం అతలాకుతం అవుతుంటే సీఎం తీసుకుంటున్న చర్యలు మొద్దు నిద్రపోయినట్లు గా ఉన్నాయని ఎలాంటి ముఖ్యమంత్రికి పాలనలో కొనసాగే హక్కులేదని సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చుతామని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో ఎప్పుడు చేర్చుతారని ప్రజలు కేటీఆర్ ను ట్విట్టర్ లో నిలదీస్తున్నారని వెల్లడించారు. కేసీఆర్, కేటీఆర్ డ్రామాలు ఆపి కరోనా బారినుంచి ప్రజలను కాపాడాలని స్పష్టం డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కరోనా ఆరోగ్యశ్రీ లో చేర్చి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.ప్రజల ప్రాణాలతో ఆడుకునే అధికారం మీకెవరిచ్చారని నిలదీశారు. కరోనా బారినపడి ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే కనిపించడం లేదా అని నిప్పులు చెరిగారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించలేని కేసీఆర్ కు సీఎం పదవిలో కొనసాగే అర్హత ఉందా? అని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వంలేని కేసీఆర్ కు ప్రజల ఉసురు తప్పక తగులుతుందని అన్నారు. కేసీఆర్ పాలన చూసి తెలంగాణ తల్లి కన్నీరు పెడుతోందని వ్యాఖ్యానించారు. కరోనా లెక్కలు కూడా సరిగా లేవని ప్రజలు అభిప్రాయపడుతున్నారని అన్నారు. నిజాలు చెప్పి ప్రజలకు చేయిత ఇవ్వాలని ,ఆక్సిజన్,మందులు ,బెడ్స్ దొరికేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకపోతే ఈ తండ్రీకొడుకులను చరిత్ర క్షమించదని కోమటిరెడ్డి అని అన్నారు.

Related posts

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజినీర్ కేసీఆరే…మూడు ప్రాజెక్టులకు రాత్రిపూటే డిజైన్లు…

Ram Narayana

వైసిపిని తిట్టి పవన్ పై అభిమానం చాటుకున్న హైపర్ అది …!

Drukpadam

ఫడ్నవిస్ తో విభేదాలపై స్పందించిన షిండే …మాది ఫెవికాల్ బంధమని వ్యాఖ్య …

Drukpadam

Leave a Comment