Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కాటా వేసిన ధాన్యాన్ని తరలించేందుకు వెంటనే లారీలు పంపాలి…

కాటా వేసిన ధాన్యాన్ని తరలించేందుకు వెంటనే లారీలు పంపాలి…

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

కాటా వేసిన ధాన్యాన్ని వెంటనే తరలించేందుకు ప్రభుత్వం వెంటనే లారీలను పంపాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. అకాల వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం మేడేపల్లి, వల్లభి, ముత్తారం తదితర గ్రామాల్లో రైతులను కలిసి మాట్లాడారు. అంతేకాక ఆయాప్రాంతాల్లోని ఐకేపీ కేంద్రాలు, సొసైటీ ఆద్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రానలు ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ముదిగొండ మండల కాంగ్రెస్ నాయకులు బుల్లెట్ బాబు, వీరబాబు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ బాబు తదితరుల పాల్గోన్నారు.
ఈ సందర్భంగా సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాటాలు వేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోజుల తరబడి కాటా వేసిన ధాన్యాన్ని లారీల ద్వారా తరలించకపోవడం వల్ల వర్షానికి ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని భట్టి అన్నారు . కాటా వేసి మిల్లులకు పంపిన ధాన్యాన్ని మిల్లర్లు 3 నుంచి 6 కేజీల వరకూ తరుగు తీస్తున్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని భట్టి చెప్పారు. రైతుల ధాన్యాన్ని ఒక్కసారి కాటా వేసి కొనుగోలు కేంద్రాలకు అప్పజెప్పిన తరువాత ఆ ధాన్యంతో రైతుకు సంబంధం ఉండదన్నారు. కాటా వేసిన తరువాత కూడా వడ్లు తడిశాయని.. మరో కారణంతో తరుగు నష్టాన్ని రైతుల మీదే రుద్దుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇంత నష్టం జరుగుతున్న ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని అన్నారు. మిల్లర్లు ఎవరూ తరుగు తీయవద్దని వ్యవసాయ శాఖా మంత్రి పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు.. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ప్రతి మిల్లులో 3 నుంచి 6 కిలోలు తరుగు తీస్తున్నారని భట్టి మండిపడ్డారు. ప్రభుత్వం తీయవద్దని చెబుతున్నా.. మిల్లర్లు తీస్తుంటే అధికారులు ఏమి చేస్తున్నారని భట్టి విక్రమార్క ఆగ్రహంగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా రైతులు భట్టి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

ఏపీ డీజీపీ సవాంగ్ బదిలీ.. కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి నియామకం!

Drukpadam

కాన్వాయ్‌ని స్లో చేయించి విన‌తి ప‌త్రాలు తీసుకున్న జ‌గ‌న్‌… 

Drukpadam

మార్చి నెల జీఎస్టీ వసూళ్ల వివరాలు వెల్లడించిన కేంద్రం!

Drukpadam

Leave a Comment