Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కరోనా భాదితులకు భరోసా కు టీడీపీ పిలుపు : నేతల గృహనిర్బంధం

కరోనా భాదితులకు భరోసా కు టీడీపీ పిలుపు : నేతల గృహనిర్బంధం
ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేత‌ల‌ను హౌస్ అరెస్టు చేస్తోన్న పోలీసులు
క‌రోనా బాధితులకు భరోసా కార్యక్రమానికి టీడీపీ పిలుపు
అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు
నిమ్మల రామానాయుడు, గన్ని వీరాంజనేయులు హౌస్ అరెస్టు
చింతమనేని ప్రభాకర్‌, బీటెక్‌ రవి కూడా
క‌రోనా బాధితులకు భరోసా కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా ఆ పార్టీ నేత‌ల‌ను గృహ నిర్బంధంలో ఉంచుతున్నారు. క‌రోనా బాధితులకు భరోసా కార్యక్రమంలో భాగంగా టీడీపీ నేత‌లు అన్ని జిల్లాల్లోని క‌రోనా రోగుల‌ను పరామర్శించాల‌ని భావించారు. వారికి మెరుగైన వైద్య సౌక‌ర్యాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, ఈ రోజు ఉద‌య‌మే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ శాసన సభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అలాగే, ఉంగుటూరులో ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, దెందులూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కడప జిల్లా సింహాద్రిపురంలో ఎమ్మెల్సీ బీటెక్‌ రవితో పాటు ప‌లువురు నేత‌ల‌ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.

Related posts

మేనకాగాంధీ, వరుణ్ గాంధీలకు షాకిచ్చిన బీజేపీ అధిష్ఠానం!

Drukpadam

మళ్లీ ఎన్డీయేనే.. ప్రధాని మోదీకే ప్రజల పట్టం.. ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వేలో వెల్లడి!

Drukpadam

మోదీకి నితీశ్ పాదాభివంద‌నం!.. తప్పేముంద‌న్న జేడీయూ!

Drukpadam

Leave a Comment