Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ సర్కార్ కు జూడాల అల్టిమేటం …

తెలంగాణ సర్కార్ కు జూడాల అల్టిమేటం …
నేటినుంచి అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు బంద్
సమస్యలు పరిష్కరించకపోతే విధుల బహిష్కరణ
తమ డిమాండ్లు పరిష్కరించకపోతే అత్యవసర సర్వీసులు మినహా అన్ని విధులను బహిస్కరిస్తామని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. ఈనెల 28 వరకు ప్రభుత్వ స్పందన చుసిన తరువాత అత్యవసర సేవలతో సహా అన్ని విధులను బహిష్కరించనున్నట్లు తెలిపారు.
తమ డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి నిరసన తెలిపేందుకు జూనియర్ డాక్టర్లు సిద్ధమవుతున్నారు. పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రేపటి నుంచి ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు మినహా మిగితా వైద్య సేవలు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు.. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే మే 28 నుంచి కొవిడ్‌ అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని అల్టిమేటం జారీ చేశారు. జనవరి 2020 నుంచి ఉపకార వేతనం పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో పాటు విధినిర్వహణలో మృతి చెందిన జూనియర్ డాక్టర్లకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నారు. తమకు బీమా సౌకర్యంతోపాటు, తమ కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో కరోనా వైద్యం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు రెండు వారాల క్రితమే ప్రభుత్వాన్ని కోరారు. రెండు వారాల్లో సమస్యలు పరిష్కరించుకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. గతంలో ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిన విధంగా 15 జీతం పెంచాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు 10 శాతం ఇన్సెంటివ్ చెల్లించాలని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రోగులకు వైద్యం చేస్తున్న చాలామంది డాక్టర్లు కూడా చనిపోయారని.. వారిని అదుకునేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో ఇంతవరకు అమలు చేయడం లేదని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. జీవోలు కేవలం కాగితాల వరకు మాత్రమే పరిమితమవుతున్నాయని జుడాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు జూనియర్ డాక్టర్ల సమ్మె పిలుపు నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో వైద్య, ఆరోగ్యశాఖ సీఎం కేసీఆర్ దగ్గరే ఉంది. ఆయనే ఈ శాఖ వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆస్పత్రులను కూడా సందర్శిస్తున్నారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్ల డిమాండ్‌పై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? వారి సమస్యల పరిష్కారానికి కచ్చితమైన హామీ ఇస్తారా ? అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది.

Related posts

సీఎం జగన్ సతీమణి భారతిపై సీపీఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు..

Drukpadam

This Autumn Juice Will Make You Feel Better

Drukpadam

టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కు జైలు శిక్ష!

Drukpadam

Leave a Comment