Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆనందయ్య…గ్రామం చేరుకున్నాడు…

ఆనందయ్య…గ్రామం చేరుకున్నాడు
వారం రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న ఆనందయ్య
ఈ నెల 21 నుంచి ఆనందయ్య మందు పంపిణీ నిలిపివేత
నెల్లూరు వెళ్లిన ఆనందయ్య…వారం తర్వాత కృష్ణపట్నం రాక
ఆనందయ్య నివాసం వద్ద పోలీసు భద్రత
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య వారం రోజుల తర్వాత తన ఇంటికి చేరుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 21 నుంచి కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయింది. మందు పంపిణీ నిలిచిపోవడంతో ఆనందయ్య నెల్లూరు వెళ్లారు. అప్పటినుంచి నెల్లూరులోనే ఉన్న ఆయన ఇవాళ కృష్ణపట్నం రావడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. వారం తర్వాత వచ్చిన ఆనందయ్యను కలిసేందుకు గ్రామస్థులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో, డీఎస్పీ ఆధ్వర్యంలో ఆనందయ్య నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ముత్తుకూరు నుంచి కృష్ణపట్నానికి రాకపోకలు నిషేధించారు. తిరిగి మందు పంపిణి చేస్తారా ? లేదా ? అనే విషయం చెప్పలేదు. అయినప్పటికీ ప్రజలు ఆయన వచ్చారన్న విషయం తెలియడంతో తండోపదండలుగా గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల వారు కూడా ఆయన్ను చూసేందుకు వచ్చారు.ఉభయ తెలుగు రాష్ట్రాలు , తమిళనాడు ,కర్ణాటక నుంచి కూడా అనేకమంది ఆనందయ్యగా మందు తీసుకునేందుకు ఎగబడతారనే ఉద్దేశయంతో గ్రామంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts

స్కూటర్ ఖరీదు రూ.71 వేలు… ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ.15 లక్షలు!

Drukpadam

లీకేజీలో కవిత పాత్ర ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణ….

Drukpadam

కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో ఖమ్మంలో భారీ అగ్నిప్రమాదం!

Drukpadam

Leave a Comment