Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

స్థిరంగా ఉన్న బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోగ్యం…

  • కరోనా బారిన పడిన బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్
  • శ్వాస తీసుకోవడంలో ఇప్పటికీ కొంత ఇబ్బంది
  • ఆయన భార్య ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందన్న వైద్యులు

పశ్చిమ బెంగాల్ రాజకీయ కోవిదుడు, మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కరోనా బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అయితే, ఆయన ఇంకా పూర్తిగా కోలుకోలేదని… శ్వాస తీసుకోవడంలో ఇప్పటికీ కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ సపోర్ట్ పైనే ఉన్నారని… ఆక్సిజన్ శాచ్యురేషన్ 92 శాతం ఉందని అన్నారు.

77 సంవత్సరాల బుద్ధదేవ్ ఈనెల 18న కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన పొడిదగ్గుతో కొంతమేర బాధపడుతున్నారు. ఆయన హార్ట్ బీట్ రేట్ 60గా ఉంది. మిగిలినవన్నీ నార్మల్ గానే ఉన్నాయని వైద్యులు తెలిపారు. మరోవైపు ఆయన భార్య కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కూడా స్థిరంగానే ఉందని డాక్టర్లు చెప్పారు. ఆమెకు రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లను ఇచ్చినట్టు వైద్యులు తెలిపారు. ఈ వారం ప్రారంభంలో ఆమె కరోనా నుంచి కోలుకున్నప్పటికీ… మళ్లీ వెంటనే ఆసుపత్రిలో చేరారు.

Related posts

వచ్చింది ఒమిక్రానా? లేక డెల్టానా..? తెలుసుకోవచ్చు..! 

Drukpadam

తొలి డోసు ఒక వ్యాక్సిన్.. రెండో డోసు మ‌రొక‌టి వేయించుకోవ‌ద్దు: డ‌బ్ల్యూహెచ్‌వో!

Drukpadam

‘కొవాగ్జిన్’ ను అధికారికంగా గుర్తించిన ఆస్ట్రేలియా…

Drukpadam

Leave a Comment